Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను ఆ హోటల్ గదిలో రెండు గంటలే పడుకున్నాను, అంతమాత్రానికే ఇలా క్రియేట్ చేస్తారా?: మలయాళ నటి ప్రయాగ మార్టిన్

Advertiesment
Prayaga Martin

ఐవీఆర్

, మంగళవారం, 8 అక్టోబరు 2024 (17:05 IST)
ఫోటో కర్టెసి-ట్విట్టర్
మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నటి ప్రయాగ మార్టిన్ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నదంటూ వచ్చిన ఆరోపణలపై ఆమె తోసిపుచ్చారు. కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ ఓంప్రకాష్‌కి సంబంధించిన డ్రగ్స్ కేసులో ఆమె పేరు బయటకు వచ్చిన ఒక రోజు తర్వాత, మలయాళ నటి ప్రయాగ మార్టిన్ మాట్లాడుతూ... అతనెవరో తనకు తెలియదంటూ. డ్రగ్స్ కేసులో నిందితులకు బెయిల్ విచారణ సందర్భంగా ఎర్నాకుళం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో, కొచ్చిలోని ఓంప్రకాష్ హోటల్ గదికి వెళ్లిన వారిలో నటి ప్రయాగ మార్టిన్, శ్రీనాథ్ భాసి కూడా ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు.
 
ఓంప్రకాష్, అతని సహచరుడు షిహాస్‌ను హోటల్‌లో భారీ డ్రగ్స్ విక్రయం గురించి పక్కా సమాచారంతో అరెస్టు చేశారు. మీడియా రిపోర్టుల ప్రకారం, పోలీసులు ఓంప్రకాష్ వద్ద కొద్ది మొత్తంలో కొకైన్‌ను కనుగొన్నారు. అతడు హోటల్‌లో డ్రగ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు తేలింది. ఈ పార్టీకి శ్రీనాథ్, ప్రయాగతో సహా యువ సినీ తారలు హాజరయ్యారంటూ ఆరోపణలు వచ్చాయి.
 
ఈ కేసుకు సంబంధించి పోలీసులు తనను ఇంకా సంప్రదించలేదని ప్రయాగ మార్టిన్ మనోరమ ఆన్‌లైన్‌తో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చింది. తన స్నేహితులను కలవడానికి హోటల్‌కు వెళ్లానని, మరుసటి రోజు కోజికోడ్‌లో ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు సాయంత్రం 7 గంటలకు బయలుదేరానని చెప్పారు. ఓంప్రకాష్‌ వ్యక్తిగతంగా నాకు తెలియదు. నిజం చెప్పాలంటే, ఈరోజు ఒక మీడియా వ్యక్తి నన్ను ఇంటర్వ్యూ కోసం సంప్రదించినప్పుడు మాత్రమే నేను అతని పేరు విన్నాను అని ఆమె చెప్పింది.
 
తన స్నేహితులను చూడటానికి ఆ హోటల్‌కి వెళ్లానంటూ చెప్పింది. కోజికోడ్‌లో ఒక ఫంక్షన్‌కి హాజరు కావడానికి తను రాత్రి వందే భారత్‌ రైలు ఎక్కవలసి వచ్చిందనీ, అందుకని కాసేపు గదిలో పడుకోగలనా అని నా స్నేహితులను అడిగానంది. తను పడుకున్న గదిలో మరో పిల్లవాడు కూడా ఉన్నాడనీ, తను తన స్నేహితురాలితో పాటు గదిలో రెండు గంటలు పడుకున్నట్లు వెల్లడించింది. ఆ సమయంలో తను ఆ హోటల్లో ఉండడం దురదృష్టకరం అని ఆమె తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభాస్ ను రాజాసాబ్ తో దర్శకుడు మారుతీ ఏవిధంగా చూపిస్తున్నాడో తెలుసా