Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'పుష్ప-2' చిత్రం రిలీజ్ వాయిదానా?

Advertiesment
pushp-2

ఠాగూర్

, మంగళవారం, 3 డిశెంబరు 2024 (22:21 IST)
సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రూపొందిన ''పుష్ప-2'' చిత్రం విడుదల వాయిదా పడనుందా? అనే సందిగ్ధత నెలకొంది. అయితే, హైకోర్టు మాత్రం ఈ చిత్రం విడుదలపై క్లారిటీ ఇచ్చింది. "పుష్ప-2" చిత్రం విడుదలను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎర్ర చందన్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం విడుదల ఆపాలంటూ సారారపు శ్రీశైలం అనే వ్యక్తి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమా స్మగ్లింగ్‌ను ప్రోత్సహించేలా ఉందని అందులో పేర్కొన్నారు. 
 
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసమి భట్టాచర్య కొట్టివేశారు. సెన్సార్ బోర్డు తరపున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. మార్పులు సూచించిన తర్వాతే ఈ సినిమా విడుదలకు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. 
 
ఊహాజనిత ఆరోపణల ఆధారంగా సినిమా విడుదలను నిలిపివేయలేదని హైకోర్టు తేల్చి చెప్పింది. కోర్టు సమయం వృథా చేసినందుకుగాను పిటిషన్‌కు జరిమానా విధించింది. ఈ జరిమానాను అక్రమ రవాణాకు గురైన మహిళ బాధితులకు, పిల్లల సంక్షేమం కోసం పాటుపడే సంస్థలకు అందజేయాలని అదేశించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'పుష్ప-2' ఎన్ని దేశాల్లో విడుదలవుతుందో తెలుసా?