Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆయనెవరో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంట.. పొద్దు తిరుగుడు పువ్వు అంట..? (video)

Advertiesment
Madhavi Latha

సెల్వి

, శుక్రవారం, 27 డిశెంబరు 2024 (14:44 IST)
Madhavi Latha
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసింది నేరం కాదు.. ఆయనకి తెలియకుండా జరిగిందని బీజేపీ నాయకురాలు, నటి మాధవీలత అన్నారు. అంతేకాదు, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ చేసింది నేరం కాదని, సరైన సమయంలో ఆయన స్పందించకపోవడమే చేసిన పొరపాటన్నారు. తప్పునకు, నేరానికి, పొరపాటుకు చాలా తేడా ఉందని ఆమె ఓ వీడియోను ఆమె విడుదల చేశారు. 
 
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు.. తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డితో భేటీ అయిన సంగతి తెలిసిందే. పుష్ప-2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
 
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సూటిగా ఆ వీడియోలో ప్రశ్నించారు. "కొంచెం బిజీగా ఉండటం వల్ల నేను ఆడగటం ఆలస్యమైంది. అన్నట్టు నిన్న మెదక్ జిల్లాలో ఒక చిన్నారిపై అత్యాచారం చేశారంట. దాని గురించి అసెంబ్లీలో ఏమైనా మాట్లాడతారా? ఓవైసీ, అక్బరుద్దీన్ ప్రశ్నిస్తారా? కొడంగల్‌లో ఒక రైతు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబమే అని చెప్పి, లేఖ రాసి పెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్నాడంట.
 
మరివాళ్ల కుటుంబానికి రూ. 25 లక్షలు ఇచ్చారా? పోనీ పాతిక వేలు ఎవరైనా ఇచ్చారా? ఆయనెవరో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంట. ఆయన పేరు పొద్దు తిరుగుడు పువ్వు అంట.. ఆ పువ్వు ఎట్టా తిరిగితే.. అట్టా తిరుగుతాడంట. మరి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ రైతు ఇంటికి వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించి ఏమైనా ఇచ్చారా?" అని ప్రశ్నించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంధ్య థియేటర్ తొక్కిసలాట : అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాయిదా