Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సితార డైలాగ్.. సాయిధరమ్, వెన్నెల కిషోర్ల ఫన్ కూడా?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కుమార్తెకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. సాధారణంగానే సితార ఫోటోలు, డ్యాన్సులకు ప్రిన్స్ ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతారు. అలాంటిది.. సైలెంట్‌గా, డీసెంట్‌గా కనిపించే పండుగాడి

Advertiesment
Mahesh Babu Daughter Sitara Dubsmash Samantha Dialogue from Brahmotsavam
, శుక్రవారం, 28 అక్టోబరు 2016 (12:20 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కుమార్తెకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. సాధారణంగానే సితార ఫోటోలు, డ్యాన్సులకు ప్రిన్స్ ఫ్యాన్స్  బ్రహ్మరథం పడుతారు. అలాంటిది.. సైలెంట్‌గా, డీసెంట్‌గా కనిపించే పండుగాడికి అల్లరి పిల్ల పుట్టిందని మహేష్‌ను సన్నిహితులు ఆటపట్టిస్తారట. బ్రహ్మోత్సవం సినిమాలో సమంత చెప్పిన డైలాగ్‌ను సితార ఎంత అందంగా చెప్పింది. ఆ డైలాగ్‌తో కూడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
మరోవైపు వెన్నెల కిషోర్‌, సత్య వంటి కమెడియన్లతో సాయిధరమ్ కలిసిన ఫోటోలకు కూడా సోషల్ మీడియాలో క్రేజ్ కొట్టేశాయి. షూటింగ్ సమయంలో వీరు చేస్తున్న ఫన్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తేజు ‘విన్నర్‌’ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో వెన్నెల కిషోర్‌ కూడా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించి వెన్నెల కిషోర్‌ కొన్ని ఫోటోలను షేర్‌ చేశాడు. డైరెక్టర్‌ గోపీచంద్‌.. రోజూ నైట్‌షూట్‌ అంటూ విసిగించడం.. తేజు, కిషోర్‌ చచ్చాంరా బాబూ అనుకుంటూ బాధపడడం.. సోషల్‌ మీడియాలో ఈ ఫోటోలు బాగా ట్రెండ్‌ అవుతున్నాయి.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియాంకను పొగడాలి కాబట్టి.. పొగుడుతున్నా.. అంతలేదంటున్న విలేకరి.........