Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాడికి అది పెట్టాలన్నావు... నువ్వు ఒక మహిళవా? నీ బూతులూ నువ్వూ... శ్రీరెడ్డిపై నెటిజన్ ఫైర్

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ జరుగుతోందనీ, అమ్మాయిలను ఆటబొమ్మల మాదిరిగా ఆడుకుంటున్నారంటూ టాలీవుడ్ హీరోయిన్ శ్రీరెడ్డి ఆమధ్య ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పైన కూడా ఆమె విమ

Advertiesment
Man
, సోమవారం, 4 జూన్ 2018 (13:57 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ జరుగుతోందనీ, అమ్మాయిలను ఆటబొమ్మల మాదిరిగా ఆడుకుంటున్నారంటూ టాలీవుడ్ హీరోయిన్ శ్రీరెడ్డి ఆమధ్య ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పైన కూడా ఆమె విమర్శనాస్త్రాలు సంధించారు. అలాఅలా ఆమె సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో బాగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు ఆమెను సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఫాలో అవుతున్నవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. 
 
రెండ్రోజుల క్రితం తన గురించి ఓ నెటిజన్ అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ ఆమె బూతులు తిడుతూ కామెంట్ పోస్ట్ చేసింది. దీనిపై మరో నెటిజన్ స్పందిస్తూ... నువ్వు ఒక మహిళవేనా? నీ బూతులూ... నువ్వు, మళ్లీ ఆడజాతి కోసం పోరాటం చేస్తావా? ఆడజాతి కోసం పోరాటం చేసేవారు ఇలా మాట్లాడరు. ఓ నెటిజన్‌ను బూతులు తిట్టావు. ముందు నువ్వు సరిగా మాట్లాడటం నేర్చుకో. ఆడజాతి కోసం పోరాటం చేయి. ఊరికే కథలు చెప్పవద్దు. నువ్వు సరిగా వుండి ఆ తర్వాత వేరేవాళ్లకి సూచనలు ఇవ్వండి. చేతకాకపోతే ఇంట్లో కూర్చో అంటూ పోస్ట్ చేశాడు. 
 
దీనిపై శ్రీరెడ్డి స్పందిస్తూ... మగవాళ్లకి మగ జాతి మీద అభిమానం ఎక్కువ. వెధవల్ని తిట్టినా తట్టుకోలేరు పాపం. మీ అబ్బాయిలకి భాషలో, బిహేవియర్లో, ప్రత్యేక అధికారాలు వున్నట్లు ఫీల్ అవుతారు. అదే లేడీస్‌ని అనాల్సి వస్తే మాత్రం వాళ్లింటి లేడీస్ పతివ్రతలనీ, మిగతావాళ్లందరికీ రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదని ఫీల్ అవుతారు. అబ్బాయిలు మాత్రం ఏదైనా మాట్లాడొచ్చు. అమ్మాయిలు మాత్రం నోటికి తాళం పెట్టుకోవాలా... అంతేనా? అంటూ ప్రశ్నించింది. మొత్తానికి బూతులు మాత్రం తిట్టలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'కావేరీ'కి 'కాలా'కు సంబంధం ఏంటి.. ఎపుడూ మమ్మల్నే టార్గెట్ చేస్తారా? ప్రకాష్ రాజ్