Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Chiranjeevi and Venkatesh: చంటి, చంటబ్బాయి పై మాస్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ

Advertiesment
Chiranjeevi and Venkatesh at Song set

దేవీ

, సోమవారం, 1 డిశెంబరు 2025 (10:22 IST)
Chiranjeevi and Venkatesh at Song set
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ లు చంటి, చంటబ్బాయి సినిమా పేర్లతో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం మన శంకరవరప్రసాద్ గారు. గత రెండు రోజులుగా పాటకు సంబంధించిన రిహార్సల్స్ కూడా జరిగాయి. నిన్నటి నుంచి షూటింగ్ ప్రారంభమైంది. కొరియోగ్రాఫర్ విజయ్ పోలాకి మాస్ ను ఆకట్టుకునే పాటను డిజైన్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.
 
హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో చిరంజీవి, వెంకటేష్ లపై స్టైలిష్ డ్యాన్స్ సాంగ్ షూటింగ్ ని మేకర్స్ ప్రారంభించారు. తొలిసారిగా, చిరంజీవి, వెంకటేష్ ఒక ఉత్సాహభరితమైన, గ్రాండ్ సెలబ్రేషన్ నంబర్ లో కలిసి అలరిస్తున్నారు.
 
ఈ సాంగ్ కోసం భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన బీట్స్ తో పర్ఫెక్ట్ డ్యాన్స్ నంబర్ ని కంపోజ్ చేశారు. ఈ పాటలో 500 మందికి పైగా డ్యాన్సర్లు పాల్గొంటున్నారు. ఈ పాటలో సెట్ ని కలర్, రిథమ్, వైబ్ ల కార్నివాల్ గా మార్చారు. ఇద్దరు స్టార్‌ల కెమిస్ట్రీ, ఎనర్జీ  ప్రేక్షకులని అభిమానులను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేయనుంది.
 
బ్లాక్ బస్టర్ హిట్ మీసాల పిల్లకి కొరియోగ్రఫీ చేసిన పొలకి విజయ్ ఈ పాటకు కూడా కొరియోగ్రఫీ అందించడం విశేషం. చార్ట్ బస్టర్ ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల 72 మిలియన్లకు పైగా వ్యూస్ ని సంపాదించి ఎప్పటికే ఈ చిత్రం హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఫ్యాన్స్ ని విశేషంగా అలరించనుంది.
 
అదేవిధంగా త్వరలోనే చిరంజీవి నయనతారలపై చిత్రీకరించిన ఒక మెలోడియస్ రొమాంటిక్ సాంగ్‌ను విడుదల చేయడానికి చిత్రబృందం సిద్ధమవుతోంది.  
 
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు.  
 
ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ సహ రచయితలు. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!