Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'అమ్మ'కు ఆఫీస్ బాయ్‌గా కూడా పని చేయను : మోహన్ లాల్

Advertiesment
mohanlal

ఠాగూర్

, శుక్రవారం, 8 నవంబరు 2024 (15:25 IST)
మలయాళ చిత్రపరిశ్రమను క్యాస్టింగ్ కౌంచ్ అంశంపై జస్టిస్ హేమా కమిషన్ ఇచ్చిన నివేదిక ఓ కుదుపు కుదిపేసింది. దీంతో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) అధ్యక్ష పదవికి అగ్ర హీరో మోహన్ లాల్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆయన "అమ్మ" అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారని గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతుంది. దీనిపై తాజాగా మోహన్ లాల్ స్పందించారు. 
 
తాను మళ్లీ అమ్మ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టనున్నట్టు సాగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు. అవి కేవలం వదంతులు మాత్రమేనన్నారు. అంతేకాకుండా ఆ అసోసియేషన్‌కు సంబంధించి ఆఫీస్ బాయ్‌గా కూడా చేయడం తనకు ఇష్టం లేదన్నారు. హేమ కమిటీ రిపోర్ట్‌లో వెలుగులోకి వచ్చిన విషయాలు తెలిసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు.
 
మేము మూకుమ్మడిగా అసోసియేషన్‌కు సంబంధించిన పదవులకు రాజీనామా చేయడానికి గల కారణాన్ని చెప్పమని అందరూ అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చిత్ర పరిశ్రమదే. ఆ రిపోర్టు ఎన్నో సమస్యలను బయటపెట్టింది. నివేదికలో ఎన్నో విషయాలు బహిర్గతమైన తర్వాత.. ప్రతిఒక్కరూ అమ్మనే ప్రశ్నించారు అని మోహన్ లాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
 
మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వర్కింగ్ కండిషన్లు, రెమ్యూనరేషన్, సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం తదితర అంశాలపై జస్టిస్ హేమ కమిటీ అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ను రూపొందించింది. కాస్టింగ్ కౌచ్ మొదలు వివక్ష వరకు కేరళ చిత్ర పరిశ్రమలో మహిళలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇందులో పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండస్ట్రీలో ఎవ్వరూ ఎవరికీ సపోర్ట్ చేయరని తేల్చి చెప్పిన దిల్ రాజు