బాలక్రిష్ణ నటించిన ఢాకు మహారాజ్ సినిమా ట్రైలర్ ను జనవరి 2న హైదరాబాద్ లో, జనవరి 4న అమెరికాలో, ఆ తర్వాత విజయవాడలో గ్రాండ్ ఫంక్షన్ చేయనున్నట్లు చిత్ర దర్శక నిర్మాతలు బాబీ, నాగవంశీ తెలియజేశారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు తెలుపుతూ, చంబల్ లోయ తదితర ప్రాంతాల్లో ఒకప్పుడు డాకూ మహారాజలు కొద్దిమంది వుండేవారు. వారిలో డాకూ కథను కల్పితంగా సినిమాగా తీశాం. విక్రమార్కుడు ఎలా ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారో అలాగే ఈసినిమా వుంటుందని బాబీ తెలిపారు.
డాకూ మహారాజ్ కు పార్ట్-2 కూడా వుంటుందని గట్టిగా చెప్పలేననీ, సినిమా చూస్తే మీకే అర్థమవుతుందని అన్నారు. ఈ సినిమాలో పలు మెస్మరైజ్ అంశాలుంటాయని అన్నారు. ఈ సినిమా షూటింగ్ లో మోక్షజ్న పాల్గొన్నాడనీ, అన్ని భాగాలను పరిశీలించారని అన్నారు. ఇందులో ఓ ప్రత్యేక సాంగ్ అందరినీ అలరిస్తుందని చెప్పారు. కానీ ఇందులో మోక్షజ్న మాత్రంకనిపించడని అన్నారు. మరి సినిమా చూస్తే కానీ తెలీదు. దర్శకులు కొన్ని సార్లు వున్నది లేనట్లు లేనిది వున్నట్లు కూడా చెబుతుంటారు.