Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Akkineni Nageswara Rao: స్మరించుకున్న మోదీ.. నాగార్జున, శోభిత, చైతూ ధన్యవాదాలు

Advertiesment
Modi_ANR

సెల్వి

, సోమవారం, 30 డిశెంబరు 2024 (12:16 IST)
Modi_ANR
అక్కినేని నాగేశ్వరరావు చేసిన కృషిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. మన్ కీ బాత్‌లో అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రధాని మాట్లాడారు. అక్కినేని నాగేశ్వరరావు మానవతా విలువలను కూడా ఆయన తన సినిమాల్లో చాటారని అన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. 
 
తెలుగు చిత్రపరిశ్రమకు అక్కినేని ఎంతో సేవ చేశారని.. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తు ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ భారతీయ చలనచిత్ర రంగం వైపు చూస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అక్కినేనితో పాటు.. రాజ్ కపూర్, మహ్మద్ రఫీ, తపన్ సిన్హాల సేవలను మోదీ స్మరించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మన సినిమాలు రికార్డులను సృష్టించడంతో పాటు అవార్డులు దక్కించుకుంటున్నాయని చెప్పారు. 
 
అక్కినేని నాగేశ్వరావు మోడీ ప్రశంసించడంతో తెలుగు ప్రేక్షకులంతా సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా అక్కినేని ఫ్యామిలీ ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. 
 
"ఐకానిక్‌ లెజెండ్స్‌తో పాటు మా నాన్న ఏయన్నార్‌ గారిని ఆయన శత జయంతి సందర్భంగా మీరు గౌరవించడం ఆనందకరం. ఏఎన్నార్ దూరదృష్టి, భారత సినిమాకి ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తి" అని నాగార్జున అన్నారు. అలాగే నాగ చైతన్య, శోభిత కూడా మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అబ్బాయిగా, అమ్మాయిగా నటిస్తున్న విశ్వక్సేన్.. లైలా