Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓజీ షూటింగ్‌కు హాజరుకానున్న పవన్ కళ్యాణ్?

Advertiesment
Pawan kalyan

డీవీ

, మంగళవారం, 15 అక్టోబరు 2024 (18:48 IST)
Pawan kalyan
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ లో పాల్గొన్నారు. మరోవైపు రాజకీయ బాధ్యతలవల్ల కొంత గేప్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఓజి’ సినిమాలో పవన్ ఓ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తుండంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌లో నెలకొన్నాయి. ఇప్పుడు ‘ఓజి’ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. విజయవాడ శివార్లలో వేసిన సెట్లో చిత్రీకరణ జరగనున్నదని సమాచారం.
 
ఇందులో ప్రియాంక మోహన్ నాయికగా నటిస్తోంది. ఇమ్రాన్ హష్మి విలన్‌. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. హరిహర కన్నా ఓజీ కాన్సెప్ట్ అద్భుతంగా వుంటుందని టాక్ ఫిలింనగర్ లో నెలకొంది. త్వరలో దీని గురించి మరింత అప్ డేట్ రాబోతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫీమేల్ ఓరియెంటెడ్‌గా ప్రియాంక ఉపేంద్ర ఉగ్రావతారం సినిమా