Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభాస్ కల్కితోపాటు మరో పాన్ వరల్డ్ మూవీలో మరో సీనియర్ నటుడు

Advertiesment
Prabhas- mahesh

డీవీ

, శనివారం, 2 మార్చి 2024 (11:35 IST)
Prabhas- mahesh
ప్రభాస్ నటిస్తున్న వరల్డ్ క్లాస్ చిత్రం “కల్కి 2898ఎడి”. దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశాపటానీ, దీపికా పదుకొనే వంటి తారాగణం నటిస్తున్నారు. ఈ సినిమాపై ఎనలేని హైప్ నెలకొనగా ఈ చిత్రం షూటింగ్ అయితే ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ అవుతుంది. కాగా, ఈ సినిమాలో మరో సీనియర్ నటుడు నటిస్తున్నాడు. ఆయనే నటకిరీటీ రాజేంద్రప్రసాద్. 
 
నిన్న ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన వందల కోట్లతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. చిన్న పెద్ద సినిమాలు చేశాను. తాజాగా కల్కిలో నటిస్తున్నాను. ఇదేకాకుండా మహేష్ బాబుతో ఓ సినిమా చేయబోతున్నట్లు వెల్లడించాడు. అయితే అది రాజమౌళి కాంబినేషన్ లో రాబోయే సినిమాగా ఇన్ డైరెక్ట్ గా రాజేంద్ర ప్రసాద్ చెప్పాడు. సో. అన్ని జనరేషన్లతో నటించే ఛాన్స్ ఆయనే దక్కుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంగళూరు వేడుకలో కలుసుకున్న ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి ఫ్యామిలీ