Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రికార్డ్ వ్యూస్ తో యూట్యూబ్ లో నెెం.1 ప్లేస్ లో ప్రభాస్ రాజా సాబ్ మోషన్ పోస్టర్

Advertiesment
No.1 place with record views

డీవీ

, గురువారం, 24 అక్టోబరు 2024 (17:34 IST)
No.1 place with record views
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాప్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ "రాజా సాబ్" మోషన్ పోస్టర్ 24 గంటల్లో రికార్డ్ వ్యూస్ తో యూట్యూబ్ లో నెం.1 ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. నిన్న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ మోషన్ పోస్టర్ రిలీజ్  చేశారు. రిలీజ్ చేసిన 24 గంటల్లో 8.3 మిలియన్ వ్యూస్ తో "రాజా సాబ్" మోషన్ పోస్టర్ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
 
"రాజా సాబ్" మోషన్ పోస్టర్ లో రాజా సాబ్ క్యారెక్టర్ లో ప్రభాస్ లుక్ వైరల్ అవుతోంది. మోషన్ పోస్టర్ ను యూనిక్ గా డిజైన్ చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. "రాజా సాబ్" మోషన్ పోస్టర్ కు వస్తున్న భారీ వ్యూస్ ఈ సినిమా మీద నెలకొన్న హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ కు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
 
సక్సెస్ ను కేరాఫ్ గా మార్చుకున్న ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ "రాజా సాబ్" సినిమాను హై ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు ది బెస్ట్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేలా రూపొందిస్తున్నారు. "రాజా సాబ్" పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో వచ్చే ఏడాది ఏప్రిల్ 10న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
 
నటీనటులు - ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిధి కుమార్, తదితరులు
 
టెక్నికల్ టీమ్ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ - కార్తీక్ పళని
మ్యూజిక్ - తమన్
ఫైట్ మాస్టర్ - రామ్ లక్ష్మణ్, కింగ్ సోలొమన్
వీఎఎఫ్ఎక్స్ - ఆర్.సి. కమల్ కన్నన్
ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ - ఎస్ కేఎన్
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా(సురేష్- శ్రీనివాస్), వంశీ కాకా
కో ప్రొడ్యూసర్ - వివేక్ కూచిభొట్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్  - కృతి ప్రసాద్
ప్రొడ్యూసర్ - టీజీ విశ్వప్రసాద్
రచన, దర్శకత్వం - మారుతి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిసెంబర్ 5 న పుష్ప పార్ట్ 2: ది రూల్ - ఆనందంలో డిస్ట్రిబ్యూటర్స్‌