Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్నేహ మళ్లీ సినిమాలకు దూరం.. కారణం ఏమిటో తెలుసా?

Advertiesment
Prasanna
, శుక్రవారం, 4 అక్టోబరు 2019 (12:44 IST)
సినీ నటి స్నేహ అంటేనే అందరికీ చిరునవ్వు గుర్తుకొస్తుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా చీరకట్టులో, సంప్రదాయ దుస్తుల్లో మెరిసే స్నేహ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయింది. హీరోహీరోయిన్లకు అక్కగా, హీరోకు వదినగా రోల్స్ చేసుకుంటూ పోతోంది. ఇకపోతే.. అవకాశాలు తగ్గుతున్న సమయంలోనే సహా నటుడు ప్రసన్నను వివాహం చేసుకుంది. 
 
ఆ తరువాత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది స్నేహ. వీరి దాంపత్యానికి ప్రతీకగా వీరికి ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టాక స్నేహ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాతో మంచి హిట్ అందుకుంది. వినయ విధేయ రామ సినిమాలో బెస్ట్ పెరఫార్మన్స్ ఇచ్చింది.
 
ప్రస్తుతం మళ్లీ స్నేహ సినిమాలకు దూరం కానుంది. కారణం ఆమె రెండోసారి తల్లి కాబోతోంది. స్నేహ శ్రీమంతం వేడుక చెన్నైలో బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతోంది. 

Prasanna


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నటి అర్చన అలియాస్ వేదకు నిశ్చితార్థం .. వరుడు ఎవరంటే?