Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Priyadarshi: ప్రేమంటే లో దోచావే నన్నే.. అంటూ ప్రియదర్శి, ఆనంది పై సాంగ్

Advertiesment
Priyadarshi, Anandi

చిత్రాసేన్

, శుక్రవారం, 10 అక్టోబరు 2025 (14:35 IST)
Priyadarshi, Anandi
 ప్రియదర్శి ప్రస్తుతం రానా దగ్గుబాటి సమర్పణలో పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వి నారంగ్ నిర్మాణంలో రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే తో రాబోతున్నారు. ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది.   సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు. "థ్రిల్-యు ప్రాప్తిరస్తు!" అనేది ట్యాగ్‌లైన్‌. దివంగత నారాయణ్ దాస్ నారంగ్ వారసత్వాన్ని కొనసాగిస్తూ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (SVCLLP)ప్రతిష్టాత్మక బ్యానర్‌ నిర్మిస్తోంది. స్పిరిట్ మీడియా సమర్పిస్తుంది.
 
ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ సింగిల్ 'దోచావే నన్నే'ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటను నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశారు. లియోన్ జేమ్స్ స్వరపరిచిన ఈ రొమాంటిక్ ట్రాక్ అదిరిపోయింది. సాఫ్ట్ మెలోడీకి స్టైలిష్ విజువల్స్‌ను మేళవించి ఈ సింగ్ ప్రేమలో ఉన్న ఎమోషన్ ని అందంగా ప్రజెంట్ చేసింది. ఎలిగెంట్ డ్యాన్స్ సీక్వెన్స్‌లు ఆకట్టుకున్నాయి.
 
అబ్బీ వి వాయిస్ ఈ పాటకు ప్రాణం పోసింది. శ్రీమణి రాసిన సాహిత్యం హార్ట్ టచ్చింగ్ వుంది. ప్రియదర్శి, ఆనంది కెమిస్ట్రీ చాలా సహజంగా, హృదయానికి హత్తుకునేలా ఉంది.
 
ఈ చిత్రానికి సహ నిర్మాత ఆదిత్య మెరుగు. ‘గామీ’ సినిమాకు గద్దర్ అవార్డు అందుకున్న సినిమాటోగ్రాఫర్ విష్ణునాథ్ రెడ్డి తన విజువల్ మ్యాజిక్‌తో ఫ్రేమ్‌లను అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నారు. రాఘవేంద్ర ఎడిటర్,  ప్రొడక్షన్ డిజైన్‌ అరవింద్ ములే, డైలాగ్స్‌ కార్తిక్ తుపురాణి, రాజ్‌కుమార్ అందించారు.
 
‘ప్రేమంటే’ సినిమా మ్యూజిక్ డ్రైవన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే సారేగామ ఈ చిత్ర ఆడియో హక్కులను సొంతం చేసుకోవడం సంగీతంపై ఉన్న నమ్మకాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Deepika : కల్కి 2, స్పిరిట్ సినిమాలకు క్రూరమైన వర్కింగ్ అవర్స్ అన్న దీపికా