Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Radhika Apte: రాధికా ఆప్టేకు ఆడబిడ్డ పుట్టి వారం రోజులైందట!

Advertiesment
Radhika Apte

సెల్వి

, శనివారం, 14 డిశెంబరు 2024 (19:27 IST)
Radhika Apte
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బోల్డ్, తరచుగా వివాదాస్పద పాత్రలకు పేరుగాంచిన నటి రాధికా ఆప్టే తన మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. బాలీవుడ్, తెలుగు సినిమాలలో తనదైన ముద్ర వేసిన రాధికా ఆప్టే.. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా హ్యాపీ న్యూస్ చెప్పారు. 
 
ప్రసవించిన ఒక వారం తర్వాత, రాధిక తన నవజాత శిశువుతో వున్న చిత్రాన్ని షేర్ చేసింది. ఆమె తిరిగి పనిలోకి వచ్చింది. ఆమె పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చింది. చిట్టితల్లితో కలిసి ఇలా వర్క్ చేసుకోవాల్సి వస్తోందంటూ రాధిక ఆప్టే చెప్పింది. ఇక బిడ్డకు పాలిస్తూ పెట్టిన పోజు కూడా వైరల్ అవుతోంది.   
 
2012లో బ్రిటిష్ వయోలిన్ వాద్యకారుడు, స్వరకర్త బెనెడిక్ట్ టేలర్‌ను వివాహం చేసుకున్న రాధిక, అక్టోబర్‌లో తన గర్భాన్ని ధ్రువీకరించింది. రాధిక తన సిస్టర్ మిడ్ నైట్ ప్రీమియర్లలో భాగంగా యూకేలో ఈ విషయాన్ని ప్రకటించింది.
 
తెలుగులో లెజెండ్, లయన్ అంటూ బాలయ్యతో కలిసి సందడి చేసింది. రక్తచరిత్ర 1, రక్త చరిత్ర 2 చిత్రాలతో టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా నిలిచింది. ప్రకాష్ రాజ్ ధోని చిత్రంలో నటిగా మెప్పించింది. లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌తో కుర్రకారుని కట్టి పడేసింది. ఇక ఈమె నటించిన అంధాదున్ చిత్రం బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. సిస్టర్ మిడ్ నైట్ కాకుండా.. విజయ్ సేతుపతి కత్రినా కలిసి నటించిన మెరీ క్రిస్మస్ చిత్రంలో రాధిక చివరగా కనిపించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్.. పూనమ్ కౌర్ కామెంట్స్.. రాజకీయం అంటే?