Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

Advertiesment
Rag Mayur

దేవి

, మంగళవారం, 2 డిశెంబరు 2025 (19:19 IST)
Rag Mayur
DJ టిల్లు ఫేమ్  రచయిత-దర్శకుడు విమల్ కృష్ణ, రాగ్ మయూర్ హీరో గా  అనుమాన పక్షి మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. మెరిన్ ఫిలిప్ కథానాయిక. ఈ చిత్రం టైటిల్,  ఫస్ట్-లుక్ పోస్టర్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేశాయి.
 
మేకర్స్ ఇప్పుడు రాగ్ మయూర్ పాత్ర ద్వారా సినిమా రిలీజ్ టైంని వెల్లడించే ప్రమోషనల్ వీడియోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో రాగ్ మయూర్ అనుమాన పక్షిగా పరిచయం అయ్యారు. అతిగా ఆలోచించడం, అతిగా జాగ్రత్తగా ఉండే స్వభావంతో తన చుట్టూ ఉన్నవారిని గందరగోళపరిచే విచిత్రమైన క్యారెక్టర్ ఆకట్టుకుంది. ప్రోమోతో పాటు, చిత్ర ప్రచార కార్యక్రమాలు త్వరలో ప్రారంభమవుతాయని, ఫిబ్రవరిలో సినిమా విడుదల కానుందని తెలియజేశారు.  ఖచ్చితమైన తేదీని త్వరలో అనౌన్స్ చేస్తారు
 
బలమైన పాత్రలతో అలరించే దర్శకుడు విమల్ కృష్ణ, ప్రత్యేకంగా రాగ్ మయూర్ కోసం రూపొందించిన యూనిక్ క్యారెక్టర్ తో వస్తున్నారు.  అతని సిగ్నేచర్ స్టైల్, హాస్యభరితమైన కథ   ప్రమోషనల్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.
 
ఈ చిత్రంలో ప్రిన్స్ సెసిల్, అనన్య, చరిత్, బ్రహ్మాజీ, రాశి, అజయ్, మస్త్ అలీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సునీల్ కుమార్ నామా సినిమాటోగ్రఫీని, శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నారు, జెకె మూర్తి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అభినవ్ కునపరెడ్డి ఎడిటర్.
 
తారాగణం: రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్, ప్రిన్స్ సిసిల్, అనన్య, చరిత్, బ్రహ్మాజీ, రాశి, అజయ్, మస్త్ అలీ

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి