Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజేంద్ర ప్రసాద్, జయప్రదల లవ్ @ 65 చిత్రం

Advertiesment
Love @ 65

డీవీ

, శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (18:46 IST)
Love @ 65
రాజేంద్ర ప్రసాద్, జయప్రద ప్రధాన పాత్రల్లో నటించిన లవ్ @ 65 అటువంటి  సరికొత్త కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ. బ్లాక్‌బస్టర్‌లను అందించిన దర్శకుడు విఎన్ ఆదిత్య టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కు దర్శకత్వం వహిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈరోజు, మేకర్స్ ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ ని విడుదల చేశారు.
 
ఆయనకి డెబ్బై నిండాయి. ఆవిడకి ఓ అరవై ఐదుదాక వుంటాయి. ఈ ఇద్దరూ కాలనీ నుండి పారిపోయిన ఆసక్తికరమైన సన్నివేశంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. విచారణలో, వారు ఒకరినొకరు ప్రేమిస్తున్నారని, వారి జీవితాంతం ఒకరితో ఒకరు గడపాలని నిర్ణయించుకున్నారని తేలుతుంది. హిలేరియస్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు, మనసును  కదిలించే భావోద్వేగాలు కూడా ఉన్నాయని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతుంది.
 
ఈ చిత్రంలో కార్తీక్ రాజు, స్పందన, క్రిష్, నిహంత్రీ రెడ్డి, నారాయణరావు, ప్రదీప్, సాయి శ్రీనివాస్, ప్రీతి నిగమ్ ముఖ్య పాత్రలు పోషించగా, అజయ్, సునీల్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు.
 
సుధీర్ చింటూ కథను అందించగా, లక్ష్మీ భూపాల డైలాగ్స్ అందించారు. శ్యామ్ తుమ్మలపల్లి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. జునైద్ సిద్ధిఖీ ఎడిటర్. సినిమా త్వరలో విడుదలకు సిద్ధమమౌతుంది.
 
నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, జయప్రద, కార్తీక్ రాజు, స్పందన, అజయ్ (అతిథి పాత్ర), సునీల్ (స్పెషల్ ఎప్పిరియన్స్ ), క్రిష్, నిహంత్రీ రెడ్డి, నారాయణరావు, ప్రదీప్, సాయి శ్రీనివాస్, ప్రీతి నిగమ్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరంభం టీజర్ లో రామాయణ స్టోరీ నెరేట్ బాగుందన్న నాగ చైతన్య