Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామ్ చరణ్ కి రంగస్థలం ఎలానో నరేష్ కి బచ్చలపల్లి అలా : నిర్మాత రాజేష్ దండా

Advertiesment
Naresh, Rajesh Danda

డీవీ

, శుక్రవారం, 13 డిశెంబరు 2024 (17:33 IST)
Naresh, Rajesh Danda
నాకు కమర్షియల్ సినిమాలు ఇష్టం. సందీప్ కిషన్ తో  'మజాకా' చేస్తున్న అది చాలా ఇష్టమైన సినిమా. అలాగే కిరణ్ అబ్బవరం  సినిమా ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక పాన్ ఇండియా సబ్జెక్ట్ కుదిరింది. త్వరలో ఆ వివరాలు చెప్తాను. ఇప్పుడు అల్లరి నరేష్ తో 'బచ్చల మల్లి' చేశా. సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహించారు. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదలకాబోతుంది అని నిర్మాత రాజేష్ దండా అన్నారు. ఈ సినిమా విశేషాల్ని ఇలా పంచుకున్నారు.
 
-ఇట్లు మారేడుమిల్లి సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు బచ్చలపల్లి కథ విన్నాను. కథ వినగానే బాడీలో ఒక ఎనర్జీ క్రియేట్ అయింది. మంచి ఎమోషనల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. నా మైండ్ లో ఈ కథ ఉండిపోయింది. ఎక్కడికి వెళ్లినా ఈ కథే గుర్తుకొచ్చేది. నరేస్గ్ కి కథ చాలా నచ్చింది. అయితే అప్పటికి నరేష్  వేరే సినిమాలు కమిట్ అవ్వడం వల్ల ఆయన కోసం రెండేళ్లు వెయిట్ చేసి ఈ సినిమా చేశాం. బచ్చలమల్లి క్యారెక్టర్ డ్రివెన్ సినిమా. 1980లో జరిగే  ఫిక్షనల్ కథ. 
 
 -రామ్ చరణ్ కి రంగస్థలం ఎలానో నరేష్ కి బచ్చలపల్లి అలాంటి సినిమా అవుతుంది. మంచి మంచి కథలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా అద్భుతంగా వచ్చింది. సినిమా చూసి ఇది నరేష్ 2.0 అని ఫీల్ అవుతారు. 
 
- బచ్చలపల్లి ఎలాంటి కథగా చెప్పాలంటే..  లైఫ్ లో తప్పులు చేయొచ్చు. కానీ సరిదిద్దుకోలేని తప్పులు చేస్తే ఎలా ఉంటుందో బచ్చలపల్లి చూపించాం. మూర్ఖత్వం బోర్డర్ దాటేసిన క్యారెక్టర్ ఇది. సినిమాలో ఎమోషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. డైరెక్టర్ సుబ్బు చాలా కసితో సినిమా చేశాడు. చాలా హార్డ్ వర్క్ చేశారు. మళ్ళీ మళ్ళీ తనతో వర్క్ చేయాలని వుంది. మా బ్యానర్ లో తను వన్ అఫ్ ది బెస్ట్ డైరెక్టర్. 
 
- నేనొక ఆడియన్ గానే కథ వింటాను. ఫస్ట్ అఫ్ ఎక్సయిట్ చేస్తేనే సెకండ్ హాఫ్ వింటాను. ఒకే తరహాలో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్టులు చేయాలని భావిస్తాను. నా సినిమాలు మీరు గమనిస్తే ఒక దానికి ఒకటి పోలిక లేకుండా అన్ని డిఫరెంట్ జోనర్స్ లో ఉంటాయి.  
 
-నేను విలేజ్ నుంచి వచ్చాను. విలేజ్ లో ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి. అలాగే హీరో క్యారెక్టర్ డ్రివెన్ సినిమాలు ఎప్పుడు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ప్రేక్షకులకి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. ఇందులో మంచి క్యారెక్టరైజేషన్, లవ్ స్టోరీ, ఎమోషన్స్.. ఇవన్నీ కూడా నన్ను ఎక్సయిట్ చేశాయి. కథ విన్నప్పుడు ఎంత ఎమోషన్ అయితే ఉందో సినిమా చూసిన తర్వాత కూడా అంతే ఎమోషనల్ గా అనిపించింది. అందుకే సినిమా పై చాలా నమ్మకంగా ఉన్నాను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మ‌ర్దానీ3 లో పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తుండ‌టం గ‌ర్వంగా ఉంది : రాణి ముఖ‌ర్జీ