Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హీరోయిన్‌నీ నేనే.. విలన్నీ నేనే.. సింగర్‌నీ నేనే.. మీకేమైన ఆభ్యంతరమా అంటున్న నేత్రసుందరి

ఒకప్పుడు దక్షిణాది తారలు బాలివుడ్‌ వెళ్లి అతి కొద్ది కాలంలో హిందీ నేర్చుకుని అవకాశాలను వినియోగించుకుని అయిదేళ్లూ, పదేళ్లూ హిందీ చిత్రరంగాన్ని దున్నేయడం అందరికీ తెలిసిందే. వహీదా రహమాన్, రేఖ, పద్మిని, శ్రీదేవి, జయప్రద.. ఈ జాబితాలో చెప్పుకుంటే కొన్ని పే

Advertiesment
rasi Khanna
హైదరాబాద్ , గురువారం, 13 ఏప్రియల్ 2017 (07:47 IST)
ఒకప్పుడు దక్షిణాది తారలు బాలివుడ్‌ వెళ్లి అతి కొద్ది కాలంలో హిందీ నేర్చుకుని అవకాశాలను వినియోగించుకుని అయిదేళ్లూ, పదేళ్లూ హిందీ చిత్రరంగాన్ని దున్నేయడం అందరికీ తెలిసిందే. వహీదా రహమాన్, రేఖ, పద్మిని, శ్రీదేవి, జయప్రద.. ఈ జాబితాలో చెప్పుకుంటే కొన్ని పేర్లు. ఈ ట్రెండ్ ఇప్పుడు రివర్స్ అయి బాలివుడ్ తారలు దక్షిణాది చిత్రరంగాన్ని దున్నేస్తున్నారు. తమన్నాతో మొదలైన ఈ ట్రెండ్ రకుల్ ప్రీత్ సింగ్‌తో తారాస్థాయికి చేరుకుంది. వీళ్లు తమ మాతృభాష హిందీ, పంజాబీలను సైతం పక్కనపెట్టి తెలుగులో ఎంత చక్కగా మాట్లాడుతున్నారటే వింటున్న తెలుగువారికే మైమరపు కలుగుతుంది. ఇప్పుడు ఈ కోవలో చేరిన కొత్త ఉత్తరాది భామ రాశిఖన్నా.
 
రాశీ ఖన్నా మాతృభాష హిందీ. అయినా ఇప్పుడు తెలుగు చక్కగా మాట్లాడగలుగుతారు. ఒకటి రెండు సినిమాల్లో నటించగానే తెలుగులో పట్టు సాధించడం అనే ఏకైక కారణం వల్లే అవకాశాలను వరుసగా చేజిక్కించుకున్న ఈమె బొద్దుగా మాట్లాడటం మాత్రమే కాదు పాట కూడా పాడేశారు. ‘జోరు’ సినిమా కోసం ఆమె టైటిల్‌ ట్రాక్‌ పాడిన విషయం గుర్తుండే ఉంటుంది.  ఇప్పుడు తన భాష కాని మరో భాషలో కూడా ఈ బ్యూటీ పాట పాడారు. అది మలయాళ సినిమా. ‘విలన్‌’. ఈ చిత్రంలో రాశీ ఖన్నా లేడీ విలన్‌గా నటిస్తున్నారట. అదో ప్రత్యేకత అయితే ఈ సినిమా కోసం పాట పాడటం మరో ప్రత్యేకత. ‘విలన్‌’ టైటిల్‌ ట్రాక్‌ను రాశి పాడారు. 
 
వాస్తవానికి చిన్నప్పటి నుంచి ఆమెకు పెద్ద సింగర్‌ కావాలనే ఆశ ఉంది. ఆమెతో పాటు పాట పాడాలనే ఆకాంక్ష కూడా పెరుగుతూ వచ్చింది. స్కూల్‌లో సింగింగ్‌ పోటీల్లో టాలెంట్‌ని కూడా ప్రదర్శించుకున్నారు. ఒకవేళ హీరోయిన్‌ కాకపోయి ఉంటే సింగర్‌గా సెటిలయ్యేవారు. ఆ అవకాశం లేదు కాబట్టి, హీరోయిన్‌గా చేస్తూనే ఛాన్స్‌ వస్తే... పాటలు కూడా పాడాలనుకుంటున్నారు. అందుకే ‘జోరు’కి అవకాశం వచ్చినప్పుడు ఆనందపడిపోయారు. ఇప్పుడు రెండో పాటకు కూడా అవకాశం రావడంతో పరమానందపడిపోతున్నారు. 
 
భాషపై పట్టు సాధిస్తే, మీరు పనిచేసే ప్రాంతం భాషను మాట్లాడటం ద్వారా మీ సొంతం చేసుకుంటే ఏరంగంలో అయినా మీకు తిరుగు ఉండదు అంటూ ప్రకాష్ రాజ్ చెప్పిన అభిప్రాయాన్ని దక్షిణాదికి దిగుమతయిన బాలివుడ్ హీరోయిన్లు చక్కగా ఆచరిస్తున్నట్లే ఉంది మరి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ డైరెక్టర్ దెబ్బకు ఈ హీరోయిన్ చాన్స్ గల్లంతు.. ఆ బాధ చెప్పలేనిదంటున్న హాసిని