Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ నుంచి మాళవిక మోహనన్ పోస్టర్ రిలీజ్

Advertiesment
Malavika Mohanan poster

దేవీ

, సోమవారం, 4 ఆగస్టు 2025 (16:48 IST)
Malavika Mohanan poster
హీరోయిన్ మాళవిక మోహనన్ రెబల్ స్టార్ ప్రభాస్ "రాజా సాబ్"తో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్ బర్త్ డే విశెస్ తో స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో చీరకట్టులో ట్రెడిషనల్ గా కనిపించి ఆకట్టుకుంటోంది మాళవిక. కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన "రాజా సాబ్" టీజర్ లో మాళవిక స్టన్నింగ్ లుక్స్, బ్యూటిఫుల్ అప్పీయరెన్స్ ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేసింది. ఈ మూవీలో మాళవిక నటన, అందం ప్రత్యేక ఆకర్షణ కానుంది. 
 
"రాజా సాబ్" లాంటి క్రేజీ మూవీతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం కావడం ఎంతో ప్రత్యేకంగా భావిస్తోంది మాళవిక మోహనన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న "రాజా సాబ్" సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం.. ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెల్లకన్ను యువకుడు ప్రేమలో పడితే ఎలా వుంటుందనే కాన్సెప్ట్ తో శ్రీ చిదంబరం చిత్రం