Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

Advertiesment
Roshan

దేవీ

, గురువారం, 13 మార్చి 2025 (17:48 IST)
Roshan
శ్రీకాంత్ కొడుకు హీరో రోషన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రదీప్ అద్వైతంతో కలిసి పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా 'ఛాంపియన్'మూవీ చేస్తున్నారు . ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సంచలనం సృష్టించింది.  రోషన్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మేకర్స్  గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.
 
గ్లింప్స్ రోషన్‌ను  స్ట్రాంగ్ విల్ పవర్ తో వున్న ఇంటెన్స్ ఫుట్‌బాల్ ఆటగాడిగా పరిచయం చేస్తుంది.  బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడం ఆకట్టుకుంది. అతని పాత్ర ప్రయాణం మైదానంలో, జీవితంలో నిజమైన ఛాంపియన్‌గా ఎదగడానికి చేసే పోరాటంగా ఉండబోతోంది.
 
గ్లింప్స్ లో రోషన్ తన పొడవాటి జుట్టు, గడ్డంతో అద్భుతంగా కనిపించాడు. అతని స్ట్రాంగ్ ప్రజెన్స్, ఫిజికల్ స్టంట్స్ అడ్వంచరస్ గా వున్నాయి. ఛాంపియన్ ధైర్యం, దృఢ సంకల్పంతో నిండిన బ్రెత్ టేకింగ్ యాక్షన్ సన్నివేశాలను అందిస్తుందని సూచిస్తుంది.
 
స్వాతంత్ర్యానికి పూర్వం నాటి ఎసెన్స్ ని ప్రజెంట్ చేస్తూ ఆర్. మాధీ అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఈ గ్లింప్స్ కు మరింత ఆకర్షణను  పెంచుతుంది. మిక్కీ జె. మేయర్ అందించిన అద్భుతమైన నేపథ్య సంగీతం మరో హైలెట్ గా నిలిచింది.
 
అద్భుతమైన విజువల్స్, ఆకట్టుకునే క్యారెక్టర్ డెవలాప్మెంట్, యాక్షన్-ప్యాక్డ్ నెరేటివ్ తో, ఛాంపియన్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది.  తోట తరణి చేసిన ఆర్ట్ డైరెక్షన్ ఈ చిత్రం యొక్క గొప్పతనాన్ని మరింత పెంచుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ