Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోషల్ మీడియా ఫేమ్ నిఖిల్. తేజు.. సంగీత్ చిత్రంతో వెండితెర జోడిగా మెరుస్తున్నారు

Advertiesment
Nikhil Vijayendra Simha  Teju Ashwini

డీవీ

, మంగళవారం, 14 మే 2024 (15:58 IST)
Nikhil Vijayendra Simha Teju Ashwini
సోషల్ మీడియా ద్వారా ఎందరో అభిమానులను సంపాదించుకున్న నిఖిల్ విజయేంద్ర సింహాను "సంగీత్" చిత్రం ద్వారా లహరి ఫిల్మ్స్ పరిచయం చేస్తోంది. నిఖిల్ కి జోడిగా తేజు అశ్విని కనిపించనుంది.

లహరి ఫిలిమ్స్, ఆర్.బి. స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న "సంగీత్" చిత్రం ఈరోజు పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. పలువురు సినీ ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. నిహారిక కొణిదెల చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందించగా, శౌర్య కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు షాట్‌కు ఎస్‌.ఎస్‌. కార్తికేయ క్లాప్‌ కొట్టారు.
 
Nikhil Vijayendra Simha  Teju Ashwini
Clap by SS kartikeya
'హంబుల్ పొలిటీషియన్ నోగ్‌రాజ్'తో ఎంతగానో గుర్తింపు పొందిన రచయిత-దర్శకుడు సాద్ ఖాన్ "సంగీత్" చిత్రానికి దర్శకత్వం వహిసున్నారు. ఈ సినిమా కోసం ఆకట్టుకునే కథాంశాన్ని ఎంచుకున్న ఆయన.. తెర మీద సరికొత్త అనుభూతిని పంచడం కోసం ప్రతిభగల టీంతో రాబోతున్నారు.
 
Nikhil Vijayendra Simha  Teju Ashwini
script handover by Niharika Konidela
ప్రేమ, కుటుంబ బంధాలు, జీవితంలోని మధురానుభూతుల మేళవింపుతో "సంగీత్" చిత్రం తెరకెక్కుతోంది. సమర్థ్ పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. సమర్థ్ పాత్రలో యువ ప్రతిభావంతుడు నిఖిల్ విజయేంద్ర సింహ కనువిందు చేయనున్నారు. తన సోదరుడి వివాహ వేడుకలో సమర్థ్ జీవితం ఎలాంటి ఊహించని మలుపు తిరిగింది అనేది వినోదాత్మకంగా చూపించబోతున్నారు.
 
"సంగీత్" చిత్రం ప్రారంభోత్సవం సందర్భంగా నిఖిల్ విజయేంద్ర సింహా మాట్లాడుతూ.. "ఈరోజు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. 'సంగీత్' నా హృదయానికి దగ్గరగా ఉన్న కథ. కథానాయకుడిగా సమర్థ్ పాత్రలోని భావోద్వేగాలను చూపించడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ చిత్రం ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. ఇందులో భాగమైనందుకు నేను గౌరవంగా భావిస్తున్నాను. దర్శక నిర్మాతలకు, చిత్ర బృందానికి నా కృతఙ్ఞతలు." అన్నారు.
 
"సంగీత్"లో స్వర అనే అందమైన పాత్రలో నటిసున్న తేజు అశ్విని మాట్లాడుతూ.. "ఈ చిత్రం బాంధవ్యాల గురించి, జీవితంలోని మధురానుభూతుల గురించి ఉంటుంది. ఎంతో ప్రతిభగల చిత్ర బృందంతో కలిసి పని చేయనుండటం సంతోషంగా ఉంది. స్వర పాత్రలో నటించడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను." అన్నారు.
 
చిత్ర దర్శకుడు సాద్ ఖాన్ మాట్లాడుతూ.. "పెళ్లి సమయంలో ఓ కుటుంబంలో జరిగే సంఘటనలను వినోదభరితంగా చూపిస్తూ ప్రేక్షకులను నవ్వించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతలుగా తమదైన ముద్ర వేసిన నవీన్, చంద్రు, శ్రవంతి గార్లతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. నిర్మాతలు ఇచ్చిన స్వేచ్ఛతో, చిత్ర బృందం సహకారంతో అద్భుతమైన చిత్రాన్ని అందిస్తామని నమ్మకంగా ఉన్నాము." అన్నారు.
 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాజ్ ఖాన్ నేతృత్వంలోని రైన్‌షైన్ కంపెనీ ఫస్ట్‌యాక్షన్‌తో కలిసి "సంగీత్" చిత్రాన్ని నవీన్ మనోహరన్, చంద్రు మనోహరన్, శ్రవంతి నవీన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్‌ఎస్‌డి టీచర్, నటుడు విక్రమ్ శివ, సూర్య గణపతి, హాస్యనటుడు హర్ష చెముడు తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు.
 "సంగీత్" చిత్రం పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుందని చిత్ర బృందం హామీ ఇచ్చింది.
 తారాగణం: నిఖిల్ విజయేంద్ర సింహ, తేజు అశ్విని, విక్రమ్ శివ, సూర్య గణపతి, హర్ష చెముడు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దిల్ రాజు తన వారసుడు ఆశిష్ ను నిలబెడతాడా?