Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సినీ ప్రేమికులకు తీపి కబురు: పాత నోట్లు తీసుకుంటున్నారట.. కానీ చిల్లర మాత్రం ఇవ్వరట..

పెద్ద నోట్ల రద్దుతో సినిమా రంగం కుదేలైంది. కలెక్షన్స్‌కు బ్రేక్ పడింది. ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంతో చాలా సినిమాలు విడుదలకు నోచుకోవట్లేదు. రిలీజ్ డేట్స్ ప్రకటించినా విడుదల చేయాలంటే నిర్మాతలు జంకు

Advertiesment
sharan: Old notes to be accepted for Kannada film tickets
, శుక్రవారం, 18 నవంబరు 2016 (12:04 IST)
పెద్ద నోట్ల రద్దుతో సినిమా రంగం కుదేలైంది. కలెక్షన్స్‌కు బ్రేక్ పడింది. ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంతో చాలా సినిమాలు విడుదలకు నోచుకోవట్లేదు.  రిలీజ్ డేట్స్ ప్రకటించినా విడుదల చేయాలంటే నిర్మాతలు జంకుతున్నారు. అయితే ఈ పరిస్థితిని అధిగమించడానికి కన్నడ సినీ పరిశ్రమ కంకణం కట్టుకుంది. శాండిల్‌వుడ్ సినీ ప్రేమికులకు తీపి కబురందించింది. 
 
నవంబర్ 30 వరకూ అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో పాత నోట్లను తీసుకుంటున్నట్లు థియేటర్ల యాజమాన్యాలు ప్రకటించాయి. అయితే 90 రూపాయల టికెట్ తీసుకుని 410 రూపాయల చిల్లర అడిగి ఇబ్బంది పెట్టొద్దని యాజమాన్యాలు సూచించాయి. 
 
ఫ్యామిలీ ఆడియన్స్ నాలుగైదు టికెట్స్ తీసుకుంటే పాత నోట్లను తీసుకుంటామని థియేటర్ యజమాన్యాలు ప్రకటించాయి. నోట్లను మార్చుకునే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు థియేటర్ల యాజమాన్యాలు వెల్లడించాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విఘ్నేష్‌తో నయనతార పెళ్ళి: రహస్యంగా చేసుకుంటుందా?