Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాటమరాయుడు అండ్ బ్రదర్స్.. అలీ ఎక్కడినుంచి వచ్చాడు.. సోషల్ మీడియాలో రచ్చ (స్టిల్స్)

జనసేన అధినేత అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాటమరాయుడు సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా హీరోయిన్ శ్రుతిహాసన్ డేట్స్ అడ్జెస్ కాకపోవడంతో ఈ సినిమాను ఆపేశారని నానా రకాల వార్తలొచ్చిన నేపథ్యంల

Advertiesment
#ShrutiHaasan #Pawan #Katamarayudu #shoot
, సోమవారం, 17 అక్టోబరు 2016 (17:01 IST)
జనసేన అధినేత అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాటమరాయుడు సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా హీరోయిన్ శ్రుతిహాసన్ డేట్స్ అడ్జెస్ కాకపోవడంతో ఈ సినిమాను ఆపేశారని నానా రకాల వార్తలొచ్చిన నేపథ్యంలో.. ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులోని నానక్‌రామ్ గూడలో జరుగుతోంది. కాటమరాయుడు, అతని సోదరులపై సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. 
 
కమెడియన్ అలీపై కూడా అక్కడే వుండటంతో కాటమరాయుడు అండ్ బ్రదర్స్‌తో అలీ అనే ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో అలీ పాత్రేంటి అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతోంది. పవన్ సినిమాలో అలీ వుండటం సహజమే. స్టోరీ లేకున్నా ఎక్కడోదగ్గర కమెడియన్ కనిపించే విధంగా సీన్‌ని క్రియేట్ చేయడం కొద్ది మూవీల్లో కనిపించింది. 
 
ఇక ఓ వైపు షూటింగ్‌కి హాజరవుతూ.. మరోవైపు ప్రజా సమస్యలపై పవన్ ఎలా ఫోకస్ పెడుతున్నాడంటూ చర్చ జరుగుతోంది. కాటమరాయుడు సినిమా ప్రాజెక్టు కోసం పవన్ కల్యాణ్ 40 రోజుల్లో తన వంతు పార్ట్‌ను ఫినిష్ చేయాలని పవన్ కల్యాణ్ భావించాడట.

ఇందులో భాగంగానే కాటమరాయుడు, బ్రదర్స్, హీరోయిన్‌తో కీలక సీన్స్‌ని తెరకెక్కించారట. వచ్చేనెల నుంచి అవుట్‌డోర్ షూట్‌కి ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్రవరిలోగా సినీ షూటింగ్ పూర్తి చేసి మార్చి 31లోపు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సినీ యూనిట్ భావిస్తోంది.

#ShrutiHaasan #Pawan #Katamarayudu #shoot


 



















#ShrutiHaasan #Pawan #Katamarayudu #shoot

























#ShrutiHaasan #Pawan #Katamarayudu #shoot

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సూర్యతో రొమాన్స్ చేయనున్న మలయాళ కుట్టి కీర్తి సురేష్...