Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

Advertiesment
shruti haasan

ఠాగూర్

, సోమవారం, 28 ఏప్రియల్ 2025 (10:59 IST)
తన ప్రేమ బంధాలు, అవి విడిపోవడానికిగల కారణాలపై హీరోయిన్ శృతిహాసన్ స్పందించారు. ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా, కొందరు వ్యక్తులు ఇది నీకు ఎన్నో బాయ్‌ఫ్రెండ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకు అది కేవలం ఒక సంఖ్య. కానీ నాకు నేను కోరుకున్న ప్రేమను పొందడంలో ఎన్నిసార్లు విఫలమయ్యానో తెలిపే సంఖ్య అది. కాబట్టి దాని గురించి నేను బాధపడను. కానీ, కొంచెం బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా మనిషినే కదా అని చెప్పుకొచ్చింది. 
 
తాను సంబంధాల్లో ఉన్నపుడు నమ్మకంగానే ఉంటానని, అయితే, ఒకరిని భాగస్వామిగా ఎంచుకోనపుడు, దాని గురించి ఇరులకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. సంబంధాలు విఫలమైనపుడు తాను భాగస్వాములను నిందించనని ఆమె స్పష్టం చేశారు. ఒక ప్రమాదకరమైన మాజీ ప్రియుడు మినహా మిగతా సంబంధాల అధ్యాయాలను తాను ఎలాంటి విచారం లేకుండానే ముగించానని చెప్పారు. తన జీవితంలో ఈ అనుభవాలు వ్యక్తిగతంగా ఎదగడానికి దోహదపడ్డాయని ఆమె పరోక్షంగా చెప్పుకొచ్చారు.
 
అలాగే, తాను కొందరు వ్యక్తులను బాధపెట్టానని, అలా చేసి ఉండకూడదని ఇపుడు అనిపిస్తోందన్నారు. మిగతా విషయాల్లో నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. కొన్ని సందర్భాల్లో నేను సరదాగా, తెలివితక్కువగా ప్రవర్తించి ఉండొచ్చు.. అది పెద్ద విషయం కాదు. కానీ నాకు అత్యంత విలువైన కొందరిని నా పొరపాట్ల వల్ల గాయపరిచాను. ఇపుడు వారికి క్షమాపణలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అని శృతిహాసన్ చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల కిష్కింధపురి ఫస్ట్ లుక్