Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బుల్లితెరతో శ్వేతాబసు ప్రసాద్‌ రీఎంట్రీ...చంద్రగుప్త మౌర్య భార్యగా...

టాలీవుడ్ నటి శ్వేతాబసు ప్రసాద్ 11 ఏళ్ల ప్రాయంలోనే హిందీ సినిమా ''మక్డీ'' ద్వారా చైల్డ్ ఆర్టిస్టుగా ప్రవేశించి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా జాతీయ అవార్డును గెలుచుకుంది. ''కుతుంబ్'', ''కహానీ ఘర్ ఘర్ కరీష్మ

Advertiesment
Shweta Basu Prasad
, శుక్రవారం, 14 అక్టోబరు 2016 (12:13 IST)
టాలీవుడ్ నటి శ్వేతాబసు ప్రసాద్ 11 ఏళ్ల ప్రాయంలోనే హిందీ సినిమా ''మక్డీ'' ద్వారా చైల్డ్ ఆర్టిస్టుగా ప్రవేశించి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా జాతీయ అవార్డును గెలుచుకుంది. ''కుతుంబ్'', ''కహానీ ఘర్ ఘర్ కరీష్మా కా కరీష్మా'', ''ది మ్యాజిక్ మేకప్'' బాక్స్ వంటి హిందీ సీరియళ్లలో లీడ్‌రోల్స్‌లో నటించి అందరిని మెప్పించింది. ఆ తరువాత నటిగా బెంగాళీ, తెలుగు, తమిళ సినిమాల్లో లీడ్ రోల్స్‌లో నటించింది. శ్వేతాబసు హీరోయిన్‌గా నటించిన తెలుగు చిత్రం ''కొత్త బంగారులోకం'' మూవీ మంచి కమర్షియల్ విజయాన్ని సాధించింది.
 
 తదనంతరం ''కాస్కో'', ''కలావర్ కింగ్'', ''ప్రియుడు'', ''నువ్వెక్కడుంటే నేనక్కడుంటా'' వంటి పలు చిత్రాల్లో నటించింది. ఆగస్టు 2014లో వ్యభిచారం ఆరోపణలపై శ్వేతాబసు హైదరాబాద్‌లో అరెస్టు అయింది. పలు విచారణల అనంతరం డిసెంబర్ 2014లో నాంపల్లి కోర్టు ఆమెకు క్లీన్‌చిట్ ఇచ్చింది. పోలీసులు ఆమెపై ఆరోపించిన సెక్షన్లంటినీ కొట్టివేసింది. దీనిపై ఆమె స్పందిస్తూ అసత్య ఆరోపణలు చేసిన మీడియాపై న్యాయపరమైన చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.
 
సెక్స్ రాకెట్ కేసులో ఇరుక్కొని... ఆ కేసు నుంచి బయటపడ్డాక కొన్నాళ్ల పాటు ఖాళీగా ఉంది. ఇటీవలే మళ్లీ ఓ టీవీ షోలో మెరుస్తోంది. ప్రస్తుతం వెండితెరపై శ్వేతాకు అవకాశాల్లేనందువల్ల మళ్లీ బుల్లితెరపై వాలింది. అక్టోబరు 10 నుంచి స్టార్‌ ప్లస్‌లో ప్రసారం కాబోతున్న సీరియల్‌లో చంద్రగుప్త మౌర్య భార్య చంద్ర-నందిని అనే పాత్రలో శ్వేత నటిస్తోంది. అంతేకాదు.. చంద్ర-నందిని పాత్ర కోసం తెగ కసరత్తులు చేస్తోందట. వెండితెరప వెలిగిపోవాలనే ఆశ ఎలాగూ నెరవేరలేదు.. మరి బుల్లితెరపైన అయినా శ్వేతా రాణిస్తుందేమో వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ప్రేమమ్'' మడోన్నా సెబాస్టియన్.. గాయనిగా కెరీర్ ప్రారంభించి.. హీరోయిన్ అయ్యింది.. కానీ?