Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షణ్ముఖ్, దీప్తి సునైనాల బ్రేకప్‌పై శ్రీరెడ్డి ఏమన్నదో తెలుసా? (video)

Advertiesment
Sri Reddy
, బుధవారం, 5 జనవరి 2022 (14:41 IST)
బిగ్ బాస్ కంటిస్టెంట్ షణ్ముఖ్, దీప్తి సునైనాల బ్రేకప్‌పై వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పందించింది. షణ్ముక్‌కు మద్దతుగా దీప్తిపై ఫైర్ అయ్యింది. ఐదేళ్లు షణ్ముక్‌తో రిలేషన్‌లో ఉన్నావ్.. సిరితో క్లోజ్‌గా ఉన్నాడని బ్రేకప్ చెప్పినట్టు అందరికీ అర్థమవుతోంది. 
 
అలా ఉంటే నువ్వు కూడా బిగ్ బాస్ షోలో హీరో తనీష్‌తో క్లోజ్‌గా ఉన్నావు కదా..? అప్పుడు మీ ఇద్దరినీ చూసిన వారంతా లవర్స్ అనుకున్నారు మరి దానికి ఏమంటావ్.. నువ్వు తిరిగితే తప్పులేదు కానీ షణ్ముక్‌ని వేలెత్తి చూపిస్తున్నావు. భారతీయ సంస్కృతిలో ఇప్పటి మహిళలు మూలాలను మర్చిపోతున్నారు. చిన్న సమస్యను కూడా పరిష్కరించుకోలేకపోతున్నారు. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచిస్తే అన్ని సమస్యలకు సమాధానం దొరకుతుంది.
 
తప్పులు అన్నాక అందరూ చేస్తారు.. ఇప్పుడంటే మీరు పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఈజీగా బ్రేకప్ చెప్పావు. ఒకవేళ పెళ్లయితే కూడా ఇలానే చెప్పేదానివా? అని దీప్తిని ప్రశ్నించింది శ్రీరెడ్డి. లవ్‌లో ఉన్నప్పుడు అందరూ టాటూలు వేయించుకుంటారు. బ్రేకప్ అయ్యాక వాటిని తీసేస్తారా? అని అడిగింది. 
Sri Reddy
Srireddy
 
అయితే, షణ్ముక్‌కు దీప్తి బ్రేకప్ చెప్పడానికి వాళ్ల పేరెంట్స్ కారణమని కొందరు అంటున్నారు. బలవంతంగా దీప్తితో బ్రేకప్ చెప్పించారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా శ్రీరెడ్డి చేసిన కామెంట్స్‌పై దీప్తి స్పందింస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాల‌కృష్ణ‌ను పూరీ ఏమి అడిగాడో తెలుసా!