Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పోలీస్ ఆఫీసర్, డాక్టర్ మధ్య ప్రేమకథతో శ్రీమురళి, రుక్మిణి వసంత్ ల బఘీర

Advertiesment
Srimurali, Rukmini Vasanth

డీవీ

, శుక్రవారం, 25 అక్టోబరు 2024 (17:44 IST)
Srimurali, Rukmini Vasanth
ఉగ్రమ్ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి ఎక్సయిటింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బఘీర'తో అలరించబోతున్నారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి కథ అందించారు. డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.  
 
ఫస్ట్ సింగిల్, ట్రైలర్ ఇప్పటికే సంచలనాన్ని సృష్టించాయి. ఇప్పుడు సెకండ్ సింగిల్- పరిచయమేలే రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాట శ్రీమురళి, రుక్మిణి వసంత్  ప్రేమకథని ప్రజెంట్ చేసింది. బి అజనీష్ లోక్‌నాథ్ స్వరపరిచిన ఈ హార్ట్ టచ్చింగ్ నెంబర్, రెండు పాత్రల మధ్య కెమిస్ట్రీని అందంగా చూపించింది.
 
శ్రీమురళి టఫ్ పోలీసు ఆఫీసర్, స్త్రీలకు హాని కలిగించే వారిని కఠినంగా శిక్షిస్తుంటాడు, రుక్మిణి సున్నితమైన ప్రవర్తన కలిగిన డాక్టర్. రెండు డిఫరెంట్ వ్యక్తిత్వాలు పాటలో బ్యుటీఫుల్ అండ్ డైనమిక్‌ గా ప్రజెంట్ చేశారు. రాంబాబు గోసాల లవ్లీ లిరిక్స్‌ ఆకట్టుకున్నాయి. రితేష్ జి రావు తన వోకల్స్ తో మెస్మరైజ్ చేశారు. ఈ పాట లీడ్ పెయిర్ మధ్య డాజ్లింగ్ కెమిస్ట్రీని హైలైట్ చేస్తుంది.
 
ఈ చిత్రానికి AJ శెట్టి సినిమాటోగ్రఫీ, ఎడిటర్‌గా ప్రణవ్ శ్రీ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్‌గా రవి సంతేహక్లు పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.
 
తారాగణం: శ్రీమురళి, రుక్మిణి వసంత్, ప్రకాష్ రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్, తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిత్తూరు బ్యాక్ డ్రాప్‌లో జాతర చిత్రం నవంబర్ లో విడుదల