Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెండ్లిచూపులప్పుడు భయపడ్డా అంటున్న సుధీర్ బాబు

Advertiesment
Sudheer Babu - Priyadarshini

డీవీ

, గురువారం, 22 ఫిబ్రవరి 2024 (18:05 IST)
Sudheer Babu - Priyadarshini
సహజంగా పెండ్లి చూపులంటే కొత్తలో ఎవరికైనా సిగ్గు, భయం వుంటాయి. కానీ ఓ సినిమాలో అల్లరి నరేశ్ పెండ్లిచూపులకు వచ్చి గీతాసింగ్ ను చూసి ఎంత భయపడ్డాడో చూసే ప్రేక్షకులకు ఆనందాన్నిస్తుంది. చాలామంది జీవితంలో జరిగితే ఇలాంటి అనుభవాలు సెలబ్రిటీలకు కూడా జరుగుతుంటాయి. అలాంటిది హీరో సుధీర్ బాబుకూ జరిగింది. ఆ వివరాలు తెలుసుకుందాం. 
 
మహేష్ బాబుకు మంజుల, ప్రియదర్శిని, పద్మావతి సోదరీమణులు. అందులో మంజుల సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ, చిట్ చాట్ లు కూడా చేస్తుంది. అందులో భాగంగా హీరో సుధీర్ బాబును, ప్రియదర్శిని ఇంటర్యూ చేసింది.
 
మీరిద్దరూ ఒకల్ని ఒకరు చూసుకున్నప్పుడు ఏ క్వాలిటీ మీకు నచ్చింది?
 
సుధీర్ సమాధానం ఇస్తూ, ఒకరోజు పెండ్లి చూపులు ప్రోగ్రామ్ పెట్టారు. అయితే ముందు రోజు పేపర్ లో ఫొటో పడింది. అందులో చాలా సింపుల్ గా వుంది. నేను పెండ్లిచూపులకు వచ్చి కూర్చున్నా. ఓ అమ్మాయి అప్పుడే లోపలినుంచి వచ్చింది. ఈమెను సరిగ్గా చూడకుండా నేను ఇంకా పెండ్లి కూతురు కోసం అటు ఇటూ చూస్తున్నా. ఇంకా ఎవరో వస్తారని. అప్పుడు ప్రియా అని పరిచయం చేశారు. 
 
ఒకసారి చూసి భయపడ్డా. అమ్మను చూసి ఏంటమ్మా.. వేరే ఫొటో చూపించావుగదా. అన్నా. లేదురా.. ఒకసారి చూడరా.. చూస్తే నీకే తెలుస్తుంది అంది. లేదమ్మా నాకు ఎప్పుడో పాత ఫొటో చూపించావు అని అనేశాను. పెద్ద ఫ్యామిలీ గదా అందుకే రమ్మన్నావా అని అమ్మతో అన్నా. లేదురా.. సరిగ్గా చూడరా.. తల పైకి ఎత్తు.. అంటూ.. అమ్మాయి చాలా బాగుంటుందని అమ్మ చెప్పింది. ఆ తర్వాత ప్రియను చూసి మనసుపడడం పెండ్లి చేసుకోవడం జరిగిపోయిందని  తన పెండ్లినాటి అనుభవాలను తెలియజేశారు. సుధీర్ బాబు మాటలకు  ప్రియదర్శిని రియాక్ట్ అయినా ముసిముసిగా నవ్వుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరుణ్ ధావన్‌తో కిస్సింగ్ సీన్‌కు రెడీ అయిన కీర్తి సురేష్