Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుమన్ కీలక పాత్రలో యధార్ధ ఘటన ఆధారంగా 'ప్రేమభిక్ష'

శ్రీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో అనిల్‌, శృతిలయ హీరోహీరోయిన్‌లుగా, ఎం.ఎన్‌. బైరారెడ్డి, నాగరాజు నిర్మాతలుగా, ఆర్‌.కె. గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ప్రేమభిక్ష'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధ

Advertiesment
Suman
, సోమవారం, 24 అక్టోబరు 2016 (17:09 IST)
శ్రీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో అనిల్‌, శృతిలయ హీరోహీరోయిన్‌లుగా, ఎం.ఎన్‌. బైరారెడ్డి, నాగరాజు నిర్మాతలుగా, ఆర్‌.కె. గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ప్రేమభిక్ష'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌లో శరవేగంగా జరుపుకుంటోంది. 
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ అనంతపురం జిల్లా భద్రపట్నం అనే గ్రామంలో జరిగిన యధార్ధ ఘటనను తీసుకుని దర్శకుడు గాంధీ ఓ మంచి కథను తయారు చేశాడు. సగానికి పైగా టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పూర్తి టాకీ ఈ నెల 25 వరకు కోలార్‌లో జరుగుతున్న షెడ్యూల్‌తో కంప్లీట్ అవుతుంది అని చెప్పారు. 
 
దర్శకుడు ఆర్.కె.గాంధీ మాట్లడుతూ ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా:దేవిశ్రీ గురూజీ నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని అన్నారు. అలాగే ప్రముఖ సీనియర్ నటుడు సుమన్ మా చిత్రంలో నటించడం మాకు గర్వకారణమన్నారు. నవంబర్ ప్రథమార్థంలో ఆడియో ఆవిష్కరణ జరపనున్నట్టు చెప్పారు. 
 
ఇందులో అనిల్‌, శృతిలయ, సుమన్‌ ,కవిత, డా: దేవిశ్రీ గురూజీ, షఫీ, రాజేంద్ర, కింగ్‌ మోహన్‌, కిల్లర్‌ వెంకటేష్‌, జ్యోతి మొదలగు వారు నటిస్తున్న ఈ చిత్రానికి స్టంట్స్‌: శంకర్‌, కొరియోగ్రఫీ: ఎస్‌.ఎస్‌.కె. సందీప్‌, పాటలు: ఘంటాడి కృష్ణ, రామ్‌ పైడిశెట్టి; సంగీతం: ఘంటాడి కృష్ణ, కెమెరా: ప్రమోద్‌. ఆర్‌; నిర్మాతలు: ఎం.ఎన్‌. బైరారెడ్డి, నాగరాజు; కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్ వం :ఆర్‌.కె.గాంధీ.​

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఛల్.. ఛల్.. గుర్రం' చిత్ర హీరోకు పవన్ కళ్యాణ్ బ్లెస్సింగ్స్