Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అగ్రహీరోలపై సెన్సేషనల్ కామెంట్ చేసిన తాప్సీ పన్ను

Advertiesment
Tapsi

డీవీ

, మంగళవారం, 5 నవంబరు 2024 (08:29 IST)
Tapsi
సహజంగా అగ్ర హీరోలు నటించిన సినిమాల్లో కథానాయికల పారితోషికం ఎక్కువగా వుంటుందని అందరూ అనుకుంటుంటారు. కానీ అదంతా పచ్చి అబద్ధం. హీరోలు ఇష్టప్రకారమే హీరోయిన్ల మనుగడ వుంటుంది. ఏ సినిమాలో నైనా వారు చెప్పినట్లే దర్శక నిర్మాతలుంటారు. వారికంటూ ఓ విజన్ వుండదు. అలా అని అందరూ కాదు. కొద్ది దర్శక నిర్మాతలు మాత్రమే కథ ప్రకారం నటీనటులు ఎంపిక జరుగుతుందని సెన్సేషన్ కామెంట్ చేసింది. 
 
తాజాగా బాలీవుడ్ ఓ ఇంటర్వూలో తాప్సీ ఈ కామెంట్లు చేసింది. గతంలో షారూఖ్ ఖాన్ తో డంకీ సినిమాలో నటించింది. ఆ తర్వాత గత  ఫిరాయి..,  ఖేల్ ఖేల్ మే సినిమాలతో వచ్చింది. ఈ రెండూ డిజాస్టర్ వచ్చాయి. ఒకప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో పేరు తెచ్చుకున్న తాప్సీ పన్ను కు ఇప్పుడు అవకాశాలు పెద్దగాలేవు. తెలుగులో కూడా సినిమా చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేయడంలేదు. 
 
తెలుగులో మంచు ఫ్యామిలీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తాప్సీ వారి బేనర్ లో కొన్ని సినిమాలు చేసింది. కొంతకాలం గేప్ తీసుకున్న ఆమె బాలీవుడ్ పై శ్రద్ధపెట్టింది. అయితే బాలీవుడ్ లో ఇప్పికే కంగనారనౌత్ కూడా కొన్ని సెన్సేషనల్ కామెంట్లు చేసింది. దాంతో ఆమెను కొద్దికాలం బేన్ చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించింది. ఇప్పుడు ఆమె వారసత్వాన్ని తీసుకున్నట్లు తాప్సీ కామెంట్లు చేస్తుంది. ఇది ఆమె కెరీర్ కు ఎలావున్నా వ్యక్తిగతంగా తనకు జరిగిన అనుభవాలను చెప్పాను. ఇండస్ట్రీ ఇంకా మారలేదు. పాత పద్ధతిలోనే వుంది అంటూ చెప్పింది. 
 
ఇప్పుడు తమ సినిమాల్లో హీరోయిన్ ఎవరనేది హీరోలు డిసైడ్ చేస్తారని ప్రేక్షకులకు కూడా తెలుసు’’ అని చెప్పింది. అందుకే ఇప్పటికైనా ఇండస్ట్రీ తీరు మారాలని పేర్కొంది. సినిమాల్లో మహిళలను గౌరవించే విధంగా హీరోలను చూపిస్తారు. కానీ వాస్తవంలో అలా వుండదు. అంటూ సెన్సేషనల్ కామెంట్ చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డబ్బుకోసం ఏదైనా చేసే రేసర్ గా నిఖిల్ సిద్ధార్థ్‌ ఏం చేశాడు?