Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తలైవి` మొదటి పాటను ఆవిష్క‌రించిన సమంత

Advertiesment
Talaivi
, శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (18:50 IST)
Talaivi,song
దివంగత సినీ నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’.ఏఎల్ విజయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నఈ మూవీలో బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ టైటిల్‌ పాత్ర పోషిస్తుండగా అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ‘తలైవి’ సినిమాను తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. విశాల్ విఠల్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.
 
సినిమా మరియు రాజకీయ ప్రయాణంలోని వివిధ దశల ద్వారా జయలలిత జీవితాన్ని చిత్రీకరించిన తలైవి యొక్క ప్రభావవంతమైన ట్రైలర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. కాగా త‌లైవి మూవీలోని మొద‌టి పాట‌ను మూడు భాష‌ల‌లో హిందీ వెర్ష‌న్‌లోని  'చాలీ చాలీ`  తమిళంలో `మజాయ్ మజాయ్` మరియు తెలుగులో `ఇలా ఇలా` పాట‌ను స‌మంత అక్కినేని రిలీజ్ చేశారు.
 
తెలుగు మరియు తమిళ భాష‌ల‌లో ప‌లు వైవిధ్యభరితమైన చిత్రాల్లో న‌టించిన సమంత  'ది ఫ్యామిలీ మ్యాన్' యొక్క రెండవ సీజన్‌తో పాన్-ఇండియా సెలబ్రిటీగా త‌న స్థానాన్ని స్థిరపరచుకున్నారు. తలైవి ట్రైలర్‌ ఆమెను ఎంత‌ ఆకట్టుకుందో పంచుకున్న తరువాత, సమంత ఈ చిత్రం యొక్క మొదటి పాటను రిలీజ్ చేశారు.
 
Talaivi
Kangana song
జయలలిత  మొట్టమొదటి చిత్రం వెన్నిరా అడై (1965) నుండి సూచనలను తీసుకున్న ఈ పాట‌లో కంగ‌నా  ఐకానిక్ రూపం, పరిపూర్ణత‌ను ప్రతిబింబిస్తుంది. పాటలో కంగన రెట్రో అండ్ మోడర్న్ లుక్‌లో ఆకట్టుకున్నారు.  
 
గోతిక్ ఎంటర్టైన్మెంట్ మరియు స్ప్రింట్  ఫిలిమ్స్ అసోసియేషన్‌తో  విబ్రీ మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా ఎంటర్టైన్మెంట్ మరియు జీ స్టూడియోలు సమర్పించిన తలైవి చిత్రానికి  విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మాత‌లు.  హితేష్ ఠక్కర్ మరియు తిరుమల్ రెడ్డి స‌హ నిర్మాత‌లు. ఈ మూవీలోని పాట‌లు టీ సిరీస్ ద్వారా విడుద‌ల‌వుతున్నాయి.  తలైవి 2021 ఏప్రిల్ 23న జీ స్టూడియో ద్వారా  హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస‌క్తిగా విశాల్ నాట్ ఎ కామ‌న్ మ్యాన్ (video) ‌