Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ట్రాన్స్ తమన్నాతో హీరోయిన్‌ తమన్నాకు తలనొప్పి.. (video)

Advertiesment
Tamanna Simhadri
, మంగళవారం, 6 ఆగస్టు 2019 (15:03 IST)
టాలీవుడ్ రియాల్టీ షో '''బిగ్ బాస్''లో ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రిపైనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇప్పటికే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటరైన తమన్నా ప్రవర్తన వివాదాలకు తావిస్తోంది. సాధారణంగా బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ మితి మీరిన‌ ప్ర‌వ‌ర్త‌న‌తో విసుగు తెప్పిస్తే వారిని ట్రోల్ చేస్తుండ‌డం నెటిజన్స్‌కి ప‌రిపాటిగా మారింది. 
 
కొన్ని రోజులుగా త‌మ‌న్నా సింహాద్రి ఇంటి స‌భ్యుల‌తో దురుసుగా ప్రవ‌ర్తిస్తుండ‌డం నెటిజ‌న్స్‌కి కూడా న‌చ్చ‌డం లేదు. దీంతో ఆమెని ట్రోల్ చేయాల‌ని భావించ‌గా, ఆమె ఐడీ లేక‌పోవ‌డంతో హీరోయిన్ త‌మ‌న్నా అఫీషియ‌ల్ ఐడీని లింక్ చేసి ట్వీట్ చేస్తున్నారట‌. దీంతో త‌మ‌న్నానోటిఫికేష‌న్ బార్ నిండిపోతుంద‌ట‌.
 
ట్రాన్స్ త‌మ‌న్నా వ‌ల‌న హీరోయిన్ త‌మ‌న్నా బ‌లైపోతుంద‌ట. ఇంకా హీరోయిన్ త‌మ‌న్నా ఐడీని ట్యాగ్ చేసి ప‌లు మీమ్స్ షేర్ చేస్తున్నారు. ఇవ‌న్నీ హీరోయిన్ త‌మ‌న్నాకి చాలా ఇబ్బందిగా మారాయ‌ట‌.  దీంతో మిల్కీ బ్యూటీ తమన్నాకు మాత్రం తలనొప్పి తెచ్చిపెట్టింది. తానేమీ తప్పు చేయకున్నా సోషల్ మీడియాలో తనపై కామెంట్లు, విమర్శలు వస్తున్నాయని హీరోయిన్ తమన్నా ఇప్పుడు వాపోతోంది. 
 
ఇంకా ట్రాన్స్‌జెండర్ తమన్నాను ట్యాగ్ చేస్తూ.. వేలాది నెగటివ్ కామెంట్లు వస్తుండటంతో, అవన్నీ హీరోయిన్ తమన్నాకు చేరుతున్నాయి. బిగ్ బాస్ హౌస్‌లో తమన్నాను అంటున్నామన్న ఉద్దేశంతో నెటిజన్లు చేస్తున్న విమర్శలు తనకు వస్తున్నాయని హీరోయిన్ చెప్తోంది. 
Tamanna Simhadri
 
ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ సీజ‌న్-3 ప్రారంభ‌మై 15 మంది కంటెస్టెంట్స్‌తో ఇప్ప‌టికే రెండు ఎలిమినేష‌న్స్ పూర్త‌య్యాయి. తొలి వారం హేమ ఇంటి నుండి బ‌య‌ట‌కి వెళ్ళ‌గా, రెండో వారం జాఫ‌ర్‌ని ఎలిమినేట్ చేశారు. ప్ర‌స్తుతం హౌజ్‌లో 14 మంది స‌భ్యులు ఉండ‌గా, కొంద‌రు గ్రూపుయిజం చేస్తున్నార‌ని దాని వ‌ల‌న ప‌ర్టిక్యుల‌ర్ ప‌ర్స‌న్స్‌ని ఎలిమినేట్ చేస్తున్నార‌ని వితికా, పున‌ర్న‌వి, వ‌రుణ్ సందేశ్ అనుకుంటున్నారు.
 
సోమవారం జ‌రిగిన 16వ ఎపిసోడ్‌లో త‌మ‌న్నా.. ర‌విని టార్గెట్ చేసి రెచ్చిపోయింది. ''బిగ్ బాస్ సీజ‌న్‌-3'' తెలుగులో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఇంట్లోకి ప్రవేశించిన కంటెస్టెంట్‌ ట్రాన్స్ జెండ‌ర్ త‌మ‌న్నా సింహాద్రి. ఈమె ప్ర‌వ‌ర్త‌న‌ బిగ్ బాస్ ఇంటి స‌భ్యులకు చిరాకు తెప్పిస్తోంది. ప‌నుల‌లో అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించ‌డమీ కాకుండా అనవసరంగా ఎదుటివారిపై ఎదురుదాడి చేయడం, అనరాని మాటలతో ఇతరులను ఇబ్బంది పెట్టడం వంటివి బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి కూడా న‌చ్చ‌డం లేదు. 
Tamanna Simhadri
 
ఆ మ‌ధ్య అలీ రాజాని దూషించిన త‌మ‌న్నా, సోమవారం జ‌రిగిన ఎపిసోడ్‌లో ర‌వికృష్ణ‌ని అన‌రాని మాట‌లు అంది. ఈ వివాదంపై తోటి ఇంటి స‌భ్యులు కూడా త‌మ‌న్నాపై ఫైర్ అయ్యారు. అయితే ఈ త‌మన్నా ప్ర‌వ‌ర్త‌న‌తో బిగ్ బాస్ హౌజ్‌లో ఇంటి సభ్యులు ఇబ్బంది పడుతుంటే… బయట మాత్రం హీరోయిన్ త‌మ‌న్నాకు కూడా ఈమె పేరుతో అనేక ఇబ్బందులు తప్పట్లేవన్నమాట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవిపై పడిన శ్రీరెడ్డి.. తమ్ముడిని ఏకేసింది.. కానీ? (video)