Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అర్థరాత్రి బెన్ఫిట్ షోలు ఎవరి బెన్ఫిట్ కోసం వేస్తున్నారు? : తెలంగాణ హైకోర్టు ప్రశ్న

Advertiesment
rashmika - allu arjun

ఠాగూర్

, బుధవారం, 4 డిశెంబరు 2024 (09:24 IST)
'పుష్ప-2' చిత్రానికి న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా, రిలీజ్‌కు ముందు ఇలాంటి సమస్యలు ఎదురుకావడం ఆ చిత్ర నిర్మాతలకు విసుగుతెప్పిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇష్టానురీతిలో పుష్ప-2 చిత్రం టిక్కెట్ ధరలను పెంచడంపై తెలంగాణ హైకోర్టు మండిపడింది. రూ.800 ధర ఎలా నిర్ణయిస్తారని అడిగింది. అసలు అర్థరాత్రి బెన్ఫిట్ షోలు ఎవరి బెన్ఫిట్ కోసం ప్రదర్శిస్తున్నారంటూ సూటింగా ప్రశ్నించింది. 
 
ఈ సినిమాకు టిక్కెట్ ధరలను గరిష్టంగా రూ.800 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనిపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలుకాగా, విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైనా చెప్తే వితండవాదం కొందరు చేస్తారని, రేటు ఎంతైనా పెట్టుకొని చూసేవాడు చూస్తాడు లేకపోతే లేదు అంటారు అది ముమ్మాటికీ తప్పని వ్యాఖ్యానించారు. 
 
స్థోమత లేని వాడు కూడా సినిమా పిచ్చిలో రూ.1000 పెట్టి సినిమా చూడాలి అని దొంగతనం చేయచ్చు, లేదా ఒక పేద కుటుంభం బియ్యానికి అని పెట్టుకున్నా డబ్బులను ఆ ఇంట్లోని కుర్రోడు దొంగతనం చేసి సినిమా చూడచ్చు, కొందరు రోడ్లపై దొంగతనాలకు కూడా పాల్పడచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. 
 
టికెట్ కౌంటర్‍లో రేటు ఓ మోస్తరుగా పెట్టి బ్లాక్‌లో ఎంత రేటుకైనా అమ్ముకొంటే సరిపోతుందనీ, ఉన్నోడు బ్లాక్‌లో కొంటాడు లేనోడు కౌంటర్‌లో క్యూ లో ఉండి వాడి భాదలు వాడు పడి సినిమా చూస్తాడు. ఆలా కాకుండా కౌంటర్ రేటునే వందల్లో పెడితే ఎలా? అని నిలదీసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లు అర్జున్ ఖాతాలో అడ్వాన్స్ బుకింగ్‌లతో కొత్త రికార్డ్