Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా ప్రతీ నిర్ణయం వెనక వాళ్లే ఉన్నారుః ఎన్టీఆర్

Advertiesment
NTR
, సోమవారం, 22 మార్చి 2021 (07:55 IST)
Ramarao
‘జీవితంలో మొదటిసారిగా మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్నాను. మీరు (అభిమానులు) అరిస్తే ఎనర్జీ వస్తుంది. ఇలా చాలా తక్కువ సార్లు ఇబ్బంది పడుతుంటాను. రేపొద్దున అభయ్, భార్గవ్ గానీ ఏదైనా సాధిస్తే వాళ్ల గురించి చెప్పాలంటే మాట్లాడలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఇప్పుడు తెలుస్తోంది. పిల్లలు సక్సెస్ అయితే తల్లిదండ్రులు ఎలా ఫీలవుతారో నా తమ్ముళ్లు సింహా, భైరవ సాధించిన విజయాలకు మాటలు సరిపోవడం లేదు. వారి గురించి చెప్పేందుకు మాటలు సమకూర్చుకుంటున్నాను. రేపొద్దున భార్గవ్, అభయ్‌ను చూసి కూడా ఎంతో సంబరపడతానేమో. నాకు 20 ఏళ్ల నుంచి దేవుడి ఇచ్చినట్టువంటి శక్తి మీరైతే. నాకు తెలిసిన ఒకే ఒక కుటుంబం కీరవాణి, జక్కన్న కుటుంబం. నేను తీసుకునే ప్రతీ ఒక్క నిర్ణయం వెనక వాళ్లే ఉన్నారు. ఈ కుటుంబానికి నేను ఎప్పుడూ గెస్ట్‌ను కానూ కాకూడదు. వారికి కూడా నేను అలా కాకూడదు. నిర్మాత సాయి గురించి కూడా అంతే ఫీలవుతున్నాను. సాయి అన్నతో 30 ఏళ్ల పరిచయం ఉంది. నాన్నగారితో ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవారు. ఆయన గురించి, సక్సెస్ గురించి ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. మన అనుకున్న వాళ్ల గురించి ఎక్కువగా మాట్లాడలేం. సినిమా సక్సెస్ అవ్వాలి. మా భైరవ, సింహలకు ఇంకో మెట్టు ఎక్కేలా ఈ మూవీ దొహదపడాలి. ఈ మూవీ హిట్ అవ్వాలి. దర్శకుడికి సక్సెస్ రావాలి. సినిమాకు పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. మంచి తల్లిదండ్రులం అని ఎలా అనిపించుకోవాలి. పిల్లలను ఎలా మంచిగా పెంచాలని ప్రణీత, నేను రోజూ అనుకుంటూ ఉంటాం. ఆ ఇద్దరూ (సింహా, భైరవ) ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం మా వళ్లమ్మ, రమమ్మ. ప్రతీ కొడుకు సక్సెస్ వెనకా ఓ తల్లి ఉంటుంది. మా పిల్లలకు ఉదాహరణగా చెప్పుకోవడానికి వీళ్లున్నారు. సింహా, భైరవకు సినిమాల పరంగానే విజయాలు కాకుండా రేపు వచ్చే యువతకు ఆదర్శంగా ఎదగాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. సక్సెస్ మీట్‌లో మళ్లీ కలుద్దాం’ అని తెల్లవారితే గురువారం`ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మావాడు నాకు బాగుంటాడు. అస‌లు విష‌యం మీరే చెప్పాలిః రాజమౌళి