Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

త్రిబాణధారి బార్బరిక్ లో సరికొత్త అవతారంలో ఉదయ భాను

Advertiesment
Udaya Bhanu

డీవీ

, శుక్రవారం, 8 నవంబరు 2024 (10:16 IST)
Udaya Bhanu
భీముడు మనవడు, ఘటోత్కచుడు కుమారుడు బార్భరిక్ (బార్బరికుడు) పాత్రను ఆధారంగా తీసుకుని ‘త్రిబాణధారి బార్బరిక్’ అనే చిత్రం రాబోతోంది. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా  విజయపాల్ రెడ్డి ఆదిధాల నిర్మించిన ఈ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద తెరకెక్కించిన ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేయడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి.
 
తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వదిలారు. ప్రముఖ నటి ఉదయభాను పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఉదయ భాను పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మరింత హైప్ పెంచేశారు. వాకిలి పద్మ అనే పాత్రను ఉదయ భాను పోషించారు. ఇక ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను చూస్తుంటే.. ఆ స్వాగ్, యాటిట్యూడ్, కుర్చీలో కూర్చున్న తీరు అన్నీ కూడా కొత్తగా ఉన్నాయి. 
 
చాలా ఏళ్ల తరువాత ఉదయ భానుకి మంచి పాత్ర పడ్డట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఇకపై ఇలానే సర్ ప్రైజింగ్ అప్డేట్లతో ఆడియెన్స్‌ను చిత్రయూనిట్ అలరించనుంది.
 
ఈ చిత్రంలో సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, వీటీవీ గణేష్, మొట్టా రాజేంద్ర, ఉధయభాను కీలక పాత్రలు పోషిస్తున్నారు. 
 
ఈ మూవీకి సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి, ఎడిటర్‌గా మార్తాండ్ కె వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్‌గా శ్రీనివాస్ పున్న బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలను రామ్ సుంకర పర్యవేక్షిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మవారి జాతర నేపథ్యంగా జాతర- మూవీ రివ్యూ