Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్ట్రీమింగ్‌లో ఉప్పెన.. అభిమానులు ఖుషీ ఖుషీ..

Advertiesment
Uppena
, బుధవారం, 17 మార్చి 2021 (08:41 IST)
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమై బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి నిర్మించాయి. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 12న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంది. 
 
వంద కోట్ల గ్రాస్‌ను ఇప్పటి వరకు ఈ చిత్రం సాధించిందని చిత్రనిర్మాతలు పేర్కోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతి శెట్టి నటించగా, విజయ్ సేతుపతి ముఖ్య పాత్ర పోషించాడు. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీపై కూడా ఓ క్లారిటీ వచ్చింది. ఉప్పెన ఈనెల 24న స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. దీంతో మరోసారి ఈ సినిమాను మరోసారి మొబైల్స్‌లో చూడోచ్చిని మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. 
 
ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. వైష్ణవ్ తేజ్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన ఉప్పెన విడుదలకు ముందే క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాను చేశాడు. ఈ సినిమాకు జంగిల్ బుక్ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. 
 
ఈ సినిమా ఓ ఫేమస్ నవల ఆధారంగా తెరకెక్కించాడు క్రిష్. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ నవలను సినిమాగా తెరకెక్కించేందుకు కథలో కొన్ని మార్పులను చేశాడట క్రిష్.
 
ఇక వైష్ణవ్‌ తేజ్‌ నటించిన మొదటి సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో అతనికి సూపర్ క్రేజ్‌ వచ్చింది. దీంతో అతడు తన క్రేజ్‌ను బాగానే క్యాష్‌ చేసుకుంటున్నాడని టాక్. ఇప్పటికే క్రిష్‌ డైరెక్షన్‌లో చేసిన సినిమాకు రూ.75 లక్షలు తీసుకోనున్నాడట వైష్ణవ్. 
 
అయితే అదంతా ఉప్పెన రిలీజ్‌కు ముందు. కానీ తాజాగా ఓ సినిమాకు కమిట్ అయినా వైష్ణవ్.. నిర్మాత భోగవల్లి ప్రసాద్‌ కాంబినేషన్‌లో రానున్న ఓ చిత్రానికి ఏకంగా రూ.2.5 కోట్లు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. వైష్ణవ్ తన తొలి సినిమా ఉప్పెన కోసం రూ.50 లక్షలు తీసుకున్నాడట.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాని, విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌!