Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దటీజ్ పవన్ స్టామినా!! వకీల్ సాబ్ టిక్కెట్ ధర రూ.1500 (video)

Advertiesment
Pawan Kalyanl Vakeel Saab
, సోమవారం, 29 మార్చి 2021 (18:31 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రం వచ్చే నెల 9వ తేదీన విడుదల కానుంది. బాలీవుడ్ చిత్రం పింకీకి రీమేక్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా, దిల్ రాజు, బోనీ కపూర్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్‌కు ఉన్న ఫాలోయింగ్ వల్ల ఇప్పటికే ఈ చిత్రం భారీగా ప్రీరిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం.
 
మరోవైపు ఈ సినిమాకు అమెరికా సహా అన్ని చోట్ల బెనిఫిట్ షోలను చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అధికారికంగా బెనిఫిట్ షో టికెట్ ధరను రూ.1500గా నిర్ణయించాలని భావిస్తున్నారట. ఏపీలో విడుదలకు ముందు రోజు రాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షో వేసేలా అనుమతులు తీసుకున్నట్టు సమాచారం. 
 
తెలంగాణలో మాత్రం సినిమా విడుదలయ్యే ఏప్రిల్ 9న ఉదయం 6 గంటలకు బెనిఫిట్ షో వేస్తారు. దీనికి కారణం కరోనా వైరస్ ప్రభావం. అంతేకాదు, ఈ సినిమా టికెట్ రేట్లను పెంచేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని సమాచారం. 
 
దీనికి సంబంధించి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే జీవోలను జారీ చేశాయి. దీంతో టికెట్ ధర రూ.300 నుంచి రూ.500 మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. అదేసమయంలో కరోనా నిబంధనలు, మార్గదర్శకాలకు లోబడి ఈ చిత్రం బెన్ఫిట్ షోలను వేయనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సన్నీ లియోన్ భర్త అదుర్స్.. ఆ మహిళకు భలే సాయం చేశాడుగా..?!