Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలీవుడ్ సింగర్‌ని కాదని వెంకటేష్ తో పాడించిన అనిల్ రావిపూడి

Advertiesment
Singer venkatesh

డీవీ

, గురువారం, 26 డిశెంబరు 2024 (18:17 IST)
Singer venkatesh
వెంకటేష్ 'గురు' సినిమాలో తన ఎనర్జిటిక్ వోకల్స్ తో పాడిన జింగిడి జింగిడి సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి సింగర్ గా అలరించబోతున్నారు వెంకటేష్. ఈ సారి, సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానున్న తన మోస్ట్ అవైటెడ్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం' లోని ట్రాక్‌కి తన వాయిస్‌ని అందిస్తున్నారు.
 
రీసెంట్ గా బిహైండ్ వీడియోలో దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, నిర్మాత శిరీష్, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ ఎక్సయిటింగ్ డెవలప్మెంట్ ని రివిల్ చేశారు.
 
మొదట్లో ఈ సినిమా స్పెషల్ ఫెస్టివల్ ట్రాక్ కోసం ప్రముఖ బాలీవుడ్ సింగర్‌ని తీసుకురావాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేశారు. అయితే వెంకటేష్ తనకు అలవాటైన చార్మ్ తో ఆ పాటను తానే పాడాలనే కోరికను వ్యక్తం చేశారు. వెంకటేష్ ఉత్సాహంగా అవకాశాన్ని కోరడం, అనిల్ రావిపూడి అంగీకరించడం వీడియోలో ఇంట్రస్టింగ్ గా ప్రజెంట్ చేశారు. 
 
'సంక్రాంతికి వస్తున్నాం'లోని ఈ వైబ్రెంట్ ఫెస్టివల్ ట్రాక్ ప్రస్తుతం RFCలో చిత్రీకరణజరుగుతోంది. ఈ చిత్రంలోని మొదటి రెండు పాటలు వైరల్ హిట్స్ గా నిలిచి ఇప్పటికే ప్రేక్షకులను అలరించాయి, ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ సాంగ్ కోసం క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఈ హై ఎనర్జీ పాటకు భాను మాస్టర్ కొరియోగ్రాఫర్. సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Game changer DHOP, చెర్రీ-కియారా ధోప్ సాంగ్ సోషల్ మీడియాలో షేక్ (Video)