Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెన్నెల కిషోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు ల‌ ఒసేయ్ అరుంధతి

Advertiesment
Vennela Kishore, Monica Chauhan, Kamal Kamaraju

డీవీ

, బుధవారం, 27 నవంబరు 2024 (19:16 IST)
Vennela Kishore, Monica Chauhan, Kamal Kamaraju
వెన్నెల కిషోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ‘ఒసేయ్ అరుంధతి’.  విక్రాంత్ కుమార్ దర్శకత్వంలో ప‌ద్మ నారాయ‌ణ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్రణయ్ రెడ్డి గూడూరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ సోమ‌వారం మూవీ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.
 
టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే.. పెళ్లైన హీరోయిన్ అనుకోని ప‌రిస్థితుల్లో భ‌ర్త‌ను హ‌త్య చేస్తుంది. శ‌వాన్ని దాచి పెట్టి పారిపోవ‌టానికి ప్ర‌య‌త్నిస్తుందని అర్థ‌మ‌వుతుంది. శ‌వాన్ని వెతికే క్ర‌మంలో పోలీసులు ఓ తాగుబోతు స‌హా అనుమానం ఉన్న కొంద‌రిని అరెస్ట్ చేస్తారు. ఫ్యామిలీ కామెడీ థ్రిల్ల‌ర్‌గా సినిమాను తెర‌కెక్కించారు. టీజ‌ర్ సినిమాపై మ‌రింత ఆస‌క్తిని పెంచుతుంది. క‌థ ఎలాంటి మ‌లుపులు తీసుకుంది.. ఇంత‌కీ హీరోయిన్ త‌న భ‌ర్త‌ను ఎందుకు చంపింది.. అనే విష‌యాలు తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌.   ఈ సందర్భంగా ....
 
చిత్ర నిర్మాత ప్రణయ్ రెడ్డి గూడూరు మాట్లాడుతూ ‘‘ కమల్ కామరాజు, వెన్నెల కిషోర్, మోనికలతో ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్‌గా ‘ఒసేయ్ అరుంధతి’ సినిమాను నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది. సినిమా షూటింగ్..పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలుపూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.
 
చిత్ర దర్శకుడు విక్రాంత్ కుమార్ మాట్లాడుతూ ‘‘హైదరాబాద్‌లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఇల్లాలుఅరుంధతి పిల్లాడితో పాటు ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఉంటుంది. ఓసారి సత్యనారాయణ స్వామి వత్రం చేయాలని అనుకుంటుంది. అయితే అనుకోకుండా అరుంధతికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్య నుంచి తనని తాను కాపాడుకుంటూ ఇంటి పరువును ఎలా కాపాడుకుంటుందనేదే ‘ఒసేయ్ అరుంధతి’ సినిమా. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీ ప్రధానంగా సాగే చిత్రమిది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. త్వ‌ర‌లోనే ఆడియెన్స్ ముందుకు సినిమాను తీసుకొస్తాం’’ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరో సూర్య 45 సినిమా ఆనైమలైలో గ్రాండ్ గా లాంచ్