Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్నా స్పీడ్ తలా! 234 కిమీ వేగంతో హీరో అజిత్ డ్రైవింగ్!

Advertiesment
ajit car speed

ఠాగూర్

, శుక్రవారం, 30 ఆగస్టు 2024 (08:37 IST)
కోలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన అజిత్ కుమార్.. ఏ పని చేసినా అది సంచలనమే. పైగా, తన పనిని సైలెంట్‌గా పూర్తి చేసేస్తాడు. తాజాగా ఆయన తన కారును ఏకంగా 234 కిలోమీటర్ల వేగంతో నడిపి పెద్ద సాహసమే చేశారు. అయితే, ఈ వీడియోను చూసిన అతి వేగం ప్రమాదకరమంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అజిత్‌కు కార్ రేసింగ్‌లంటే అమితమైన పిచ్చి. ఈ విషయాన్ని ఆయన మరోమారు నిరూపించారు. తన ఆడీ కారులో కళ్లు చెదిరే వేగంతో దూసుకెళ్లాడు. ఏకంగా గంటకు 234 కిలోమీటర్ల వేగంతో అజిత్ కారు నడుపుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను అజిత్ అభిమానులు షేర్ చేసుకుంటూ ‘ఎన్నా స్పీడ్ తలా.. (ఆ స్పీడ్ ఏంటి) అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది, అంత స్పీడ్‌తో అజిత్ కారు ఎక్కడ నడిపాడనే వివరాలు తెలియరాలేదు. అయితే, ఈ సంఘటన తప్పకుండా విదేశాలలోనే జరిగి ఉంటుందని అభిమానులు చెబుతున్నారు. విదేశీ రోడ్లపై వాహనాలు గంటకు 150, 200 కి.మీ. వేగంతో దూసుకెళ్లడం సాధారణమే. అక్కడి రోడ్ల నిర్మాణంలో ప్రత్యేకతల వల్ల ఆ వేగంతో వెళ్లడానికి వీలవుతుంది. 
 
కాగా, ఈ వీడియోపై కొంతమంది నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. బైక్, కార్ రేసింగుపై ఇష్టంతో అజిత్ ఇంటర్నేషనల్ ఎఫ్‌ఐఏ రేసింగ్ ఛాంపియన్ షిప్‌లలో పాల్గొన్న విషయం గుర్తుచేశారు. ఆయన శిక్షణ పొందిన రేసర్ అనే విషయం తెలియని అభిమానులు ఆయనను అనుకరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వీడియోను చూసి ఆయన అభిమానులు ఇండియన్ రోడ్లపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కార్ల రేస్‌కు ప్రయత్నించే అవకాశం ఉందని విమర్శిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయ్ సేతుపతి, సూరి ల విడుదల 2 రిలీజ్ కు సిద్ధమవుతోంది