Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్ సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడితే చావడం ఖాయం : సైఫ్ అలీఖాన్

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు పెను దుమారం రేపుతున్నాయి. భారత సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడితే చావడం ఖాయం. ఎవరో ఒకరు చస్తారు అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే ఇపుడు వివాదాస్ప

Advertiesment
Saif Ali Khan
, సోమవారం, 16 జులై 2018 (08:50 IST)
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు పెను దుమారం రేపుతున్నాయి. భారత సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడితే చావడం ఖాయం. ఎవరో ఒకరు చస్తారు అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే ఇపుడు వివాదాస్పదమయ్యాయి.
 
దేశంలోని తొలి నెట్‌ఫ్లిక్స్ షో అయిన 'సేక్రెడ్ గేమ్స్' ఈనెల స్ట్రీమింగ్ సర్వీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సైఫ్ పోలీసాఫీసర్ సర్తాజ్ సింగ్ పాత్రను పోషించాడు. ఈ సిరీస్‌కు చుట్టూ వివాదాలు ముసురుకుంటున్న నేపథ్యంలో సైఫ్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.
 
ఇందులో ఆయన మాట్లాడుతూ, మన కులం కాని వారితో డేటింగ్ చేసినా, ప్రభుత్వాన్ని విమర్శించినా ఎవరో ఒకరు చంపేయడం ఖాయమన్నారు. ఇప్పుడీ వ్యాఖ్యలపై సర్వత్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు రాజకీయ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు.
 
నిజానికి 'సేక్రెడ్ గేమ్స్'పై తొలి నుంచీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మితిమీరిన శృంగారం, హింస, రాయలేని భాషలో పదప్రయోగం వంటివి ఇందులో ఉపయోగించారు. ముఖ్యంగా భారత రాజకీయాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక గురువు ఎవరో తెలుసా?