Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'మగువ, ఈ లోకానికి తెలుసా నీ విలువ'తో ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న జీ తెలుగు

Advertiesment
Zee Telugu
, బుధవారం, 3 మార్చి 2021 (17:28 IST)
“మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షయినా ఒక్క రెక్కతో ఎగరలేదు” అన్న స్వామి వివేకానంద మాటలు మరోసారి స్మరిస్తూ.. ‘జయహో... జనయిత్రి’ అంటూ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళామూర్తులకు అందరి మనసులకి చాలా దగ్గరగా ఉండే జీ తెలుగు 'మగువ, ఈ లోకానికి తెలుసా నీ విలువ' అంటూ ఒక కార్యక్రమం ఈ ఆదివారం ప్రసారం చేయనుంది.
 
‘అన్నీ మారుతున్నాయి. మహిళల పట్ల మన ఆలోచన ధోరణి తప్ప. అవును. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత’ అని ఆర్యోక్తి. దీనికి అర్థం ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని. కాని దేవతగా కొలవాల్సిన స్త్రీ మూర్తిపై అత్యాచార సంస్కృతి నేటి పరిస్థితుల్లో ఆందోళన కలిగిస్తోంది.
Zee Telugu
అలా పుట్టిన పాప దగ్గర నుండి ఒక నారి పడే కష్టాలు ఎన్నో, ఆ కష్టాలు మరియు కన్నీళ్లను మన ముందు తెస్తున్నారు జీ తెలుగు కుటుంబం యొక్క మహిళలు. మేఘన లోకేష్, శ్రీదేవి, సునంద మాలాశెట్టి, రీతూ చౌదరి, మధుమిత మరియు తదితర తారలు అందరు కూడా వారి ప్రదర్శనలతో అందరిని అలరించబోతున్నారు. ఈ ఆదివారం మార్చి 7 నాడు 5 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డీలలో.
Zee Telugu
రంగం ఏదైనా ఉన్నత శిఖరాలను చేరుకుని పురుష శక్తికి తామేమీ తీసిపోమని చాటిచెప్తుంది స్త్రీ శక్తి. తాము ఇంటికే పరిమితం కాదంటూ పురుషులకు ధీటుగా విజయాలు సాధిస్తున్నారు. అలాంటి స్త్రీ మూర్తులను జీ తెలుగు సాదరంగా సత్కరించబోతున్నారు. మిస్ ఇండియా 2020 మానస వారణాసి, జీవిత రాజశేఖర్, యాంకర్ ఉదయభాను, కనకవ్వ - తెలంగాణ జానపద కళాకారిణి, ఎస్ఐ శిరీష - శ్రీకాకుళం, వీణ శ్రావణి, శివ జ్యోతి, జోగిని శ్యామల, సంధ్య రాజు, మరియు శివ పార్వతి తదితర మహిళలను మరియు వారి గాధలను అందరి ముందుకు తేబోతుంది మన జీ తెలుగు.
Zee Telugu
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపించడానికి మన అందరి హృదయాలకి ఎంతో దగ్గర ఉండే ఆప్తుడు, స్నేహితుడు ప్రదీప్ మాచిరాజు యాంకర్‌గా వ్యవహరిస్తున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ సోహైల్ కొత్త గెట‌ప్‌!