Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొత్త సీసాలో పాత కథ వరుణ్ తేజ్ మట్కా మూవీ రివ్యూ

Advertiesment
Matka-Varun

డీవీ

, గురువారం, 14 నవంబరు 2024 (16:18 IST)
Matka-Varun
నటీనటులు: వరుణ్ తేజ్-మీనాక్షిచౌదరి-నోరా ఫతేహి-కిషోర్-నవీన్ చంద్ర-జాన్ విజయ్-సత్యం రాజేష్-అజయ్ ఘోష్-సలోని తదితరులు సాంకేతికత: సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్ ఛాయాగ్రహణం: కిషోర్ కుమార్ నిర్మాతలు: విజేందర్ రెడ్డి తీగల-రజని తాళ్ళూరి రచన-దర్శకత్వం: కరుణ్ కుమార్ 
 
కథ: 
వాసుదేవ్ అలియాస్ వాసు (వరుణ్ తేజ్) ఓ శరణార్థిగా తల్లితో కలిసి విశాఖపట్నానికి వస్తాడు. అక్కడ మార్కెట్ లో కొబ్బరికాయల వ్యాపారం చేసే అజయ్ ఘోష్ దగ్గర పని కోసం చేరతాడు. మార్కెట్ ను కంట్రోల్ చేసుకున్న కె.పి. గ్యాంగ్ అజయ్ ఘోష్ దందా ఇవ్వలేదని చంపడానికి ట్రైచేస్తాడు. అప్పుడు వాసు అతన్ని రక్షించి యజమాని వ్యాపారంలో వాటాదారుడుగా మారిపోతాడు. ఆ తర్వాత మార్కెట్ పై పట్టువున్న మరో గ్యాంగ్ నానిబాబు వచ్చి తన మనిషిగా వాసును ట్రీట్ చేసి మార్కెట్ మొత్తం అతని ఆదీనంలో వుండేలా చేస్తాడు. అలా వారి పరిచయం బోంబే నుంచి బట్టలు తెచ్చే వ్యాపారంవరకు ఆతర్వాత మట్కా వ్యాపారానికి దారితీస్తుంది. అసలు ఈ మట్కాల జూదం వాసుకు ఎలా తట్టింది అనేది సినిమాలో ఆసక్తికరమైన పాయింట్. ఆ మట్కా జూదంలో ప్రజల ఆశను తనకు అనుకూలంగా మార్చుకుని కోటీశ్వరుడు అవుతాడు. చివరికి దేశ ఆర్థిక వ్యవస్థకే పెనుసవాల్ గా మారిన మట్కాను ప్రభుత్వం బేన్ చేసే స్థితికి వస్తుంది. ఆ తర్వాత ఏమి జరిగింది? ఈమద్యలో జరిగే నాటకీయ పరిణామాలు ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
ఈ కథ భారతదేశంలో  1960లో జరిగిన కథగా దర్శకుడు రాసుకున్నాడు. అప్పట్లో మట్కా జూదంతో దేశాన్ని గడగడలాడించిన ఓ వ్యక్తి కథతో తీసిన సినిమా. ఇలాంటి చట్టవ్యతిరేక వ్యాపారాలు, దందాలు దేశంలో పలు చోట్ల జరిగేవి. అప్పట్లో లాటరీ టిక్కెట్ వ్యాపారం కూడా అటువంటిదే. ఇలా ప్రతిచోట ఏదో దందాలు జరిగేవి. కానీ మట్కా అనేది పాతకుపోయింది. అయితే ఇలాంటి కథల్లో సామాన్యుడు దేశాన్ని శాసించే స్థాయికి చేరడమే కీలకమైన పాయింట్. ఇంచుమించు గాడ్ ఫాదర్ లాంటి కథను పోలివుంటుంది.
 
ఇప్పటి జనరేషన్ కు మట్కా ఏమిటో తెలియకపోవచ్చు. కానీ ఈమధ్య దర్శక నిర్మాతలు ఫ్యాష్ బ్యాక్ లో జరిగే విషయాలను కథగా తీసుకుని ఆయా నేపథ్యంతో కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాలో వాసు జీవితంలో జరిగిన సంఘటనలు ఇంచుమించు గతంలో వచ్చిన రౌడీ నేపథ్య చిత్రాలలాగే అనిపిస్తాయి.  పలాస.. శ్రీదేవి సోడా సెంటర్ చిత్రాలతో  దర్శకుడు కరుణ్ కుమార్ కొత్తగా చూపించాడు.  ఈసారి మాస్ స్టయిల్లో స్టయిలిష్గా చూపించే ప్రయత్నం చేస్తాడు. ఆ కోవలో ఒక్కోసారి కొన్ని సన్నివేశాలు విసుగుపుట్టిస్తాయి. ఎక్కడా ఇప్పటి జనరేషన్ కు ఆకట్టుకునే సాంగ్ వుండవు. క్లబ్ లో సాగే రెండు పాటలు కనిపిస్తాయి. కానీ అవి క్యాచీగా అనిపించవు. సంగీతపరంగా నేపథ్య సంగీతాన్ని జివిప్రకాష్ కుమార్ బాగా చేశారు.
 
జీవితంలో గట్టి ఎదురు దెబ్బ తిన్న కుర్రాడు తన ఆలోచనలతో అంచెలంచెలుగా ఎదిగే కథలు చాలానే వున్నాయి. నేపథ్యంలో కొత్తగా అనిపించి దర్శకుడు రెగ్యులర్ ఫార్మాటే అయినా దాన్ని ఆసక్తికరంగా దర్శకుడు చూపించారు.   హీరోను ఎలివేట్ చేయడానికి కొన్ని ఎపిసోడ్లు దర్శకుడు పెట్టాడు కానీ అవి అంతకు చాలా సినిమాల్లో చూపించినవిగా అనిపించడం కొంచెం లోపంగా కనిపిస్తుంది. మలుపులు, అబ్బురపడేంతగా ఏమీ లేకపోవడంతో సాదాసీదాగా కనిపిస్తుంది. ఇలాంటి కథల్లో నమ్మక ద్రోహం, ప్రతీకారం వంటి మూసలో సాగిపోతుంది. అయితే ఇందులో 60, 70, 80 దశకాల్లోని పరిస్థితులను బాగా చూపించాడు. . నిర్మాణ విలువలు బాగున్నాయి. కథ పాతది కాబట్టి  కథనం కూడా నిదానంగా సాగుతుంది. కొన్ని చోట్ల  'మట్కా' నీరసమే తెప్పిస్తుంది. 
 
ఇందులో కొన్ని డైలాగులు.. వరుణ్ తేజ్ పెర్ఫామెన్స్, గెటప్స్ మినహాయిస్తే చెప్పుకోదగ్గ అంశాలు లేవు. నటీనటులు: వరుణ్ తేజ్ వయసు పెరిగే కొద్దీ వచ్చే పరిణతిని పాత్రలో చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఆ గెటప్ లో నాగబాబును గుర్తుచేసేలా వుంటుంది. ఇక  హీరోయిన్ మీనాక్షి చౌదరి హోమ్లీ క్యారెక్టర్ పాత్రలో కనిపించింది. కానీ ఆమె పాత్ర పరిధి తక్కువ. ఆమెసోదరిగా సలోని నటించింది.   నోరా ఫతేహి మేకవన్నె పులిగా కనిపిస్తుంది.  విలన్ పాత్రలో జాన్ విజయ్, కిషోర్ పర్వాలేదు. పరిశోధకుడిగా నవీన్ చంద్ర తన పాత్రలో రాణించాడు. అజయ్ ఘోష్, సత్యం రాజేష్ పాత్రలు ఓకే అనిపిస్తాయి.
 
సాంకేతికంగా చూస్తే జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం డిఫరెంట్ స్టయిల్లో వుంది. పాటలు ఏదో అలా సాగిపోతాయి. నేపథ్య సంగీతం ఓ మోస్తరుగా అనిపిస్తుంది. కిషోర్ కుమార్ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. ''ఆశను అమ్ముతాం.. నమ్మకాన్ని కొంటాం'' లాంటి డైలాగులు బాగున్నాయి. అయితే మట్కా తర్వాత మరో జూదం ప్రజల ఆశను అమ్మే వ్యాపారం క్రికెట్ అనే ట్విస్ట్ బాగుంది. సన్నివేశపరంగా మట్కా గేమ్ గురించి  హీరో ఓ డైలాగ్ చెబుతాడు. కొత్త సీసాలో పాత వైన్.. అంటూ  ఇలాంటి సినిమా మాస్ ప్రేక్షకులను ఏమాత్రం అలరిస్తుందే చూడాలి. 
రేటింగ్- 2.25/5 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నటి శ్రీరెడ్డిపై వరుస కేసులు : నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్టు...