డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయిన రష్మీ... "నెక్స్ట్ నువ్వే" ట్రైలర్
వెండితెరకు దర్శకుడిగా పరిచయమవుతున్న బుల్లితెర ప్రభాకర్, ఆది సాయికుమార్ కథానాయకుడిగా ఒక హారర్ థ్రిల్లర్ కామెడీ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని వీ4 మూవీస్ పతాకంపై నిర్మాత బన్నీ వాసు నిర్మించాడు. ఈ
Publish Date: Mon, 18 Sep 2017 (15:04 IST)
Updated Date: Mon, 18 Sep 2017 (15:08 IST)
వెండితెరకు దర్శకుడిగా పరిచయమవుతున్న బుల్లితెర ప్రభాకర్, ఆది సాయికుమార్ కథానాయకుడిగా ఒక హారర్ థ్రిల్లర్ కామెడీ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని వీ4 మూవీస్ పతాకంపై నిర్మాత బన్నీ వాసు నిర్మించాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
ఆదికి జంటగా వైభవి నటించగా, ఈ చిత్రంలో రష్మీ ఒక కీలకమైన పాత్రను పోషించింది. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఈ ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. ప్రధాన పాత్రధారులను కవర్ చేస్తూ ఈ ట్రైలర్‌ను రూపొందించారు.
కామెడీ .. ఎమోషన్ .. సస్పెన్స్ .. హారర్‌కి సంబంధించిన సీన్స్‌పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించేదిలా వుంది. నలుగురు స్నేహితులు కలిసి పెట్టిన ఒక హోటల్ నేపథ్యంలో ఈ కథ మొదలవుతుంది. ఈ ట్రైలర్లో రష్మీ డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయింది. కాగా, ఈ చిత్రం నవంబర్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీత బాణీలను సాయి కార్తీక్ సమకూర్చారు.
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.....
Read More