Vijaysethupati and vidudala2 team
విజయ్ సేతుపతి, వెట్రీమారన్ కలయికలో రూపొందిన 'విడుదల -1' చిత్రం విజయం సాధించడంతో సీక్వెల్ కూడా తీశారు. ఇప్పుడు ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. తెలుగులో కూడా విడుదల చేయడానికి నిర్మాత ముందుకు వచ్చారు. విడుదల-2'. డిసెంబరు 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.. ప్రముఖ నిర్మాత , శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు. ఈ చిత్ర తెలుగు హక్కులను దక్కించుకున్నారు.
కాగా ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ను కథానాయకుడు విజయ్ సేతుపతి ఆదివారం చెన్నయ్‌లో విడుదల చేశారు. ఈ చిత్రంలో పెరుమాళ్ అనే పాత్రలో విజయ్ సేతుపతి అభినయం ఈచిత్రానికి హైలైట్‌గా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. పెరుమాళ్ పోరాట వీరుడిగా ఎలా మారాడు అనేది ఎంతో ఆసక్తికరంగా ఈ చిత్రంలో వెట్రీమారన్ ప్రజెంట్ చేశాడు.
ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ ". విజయ్ సేతుపతి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. విజయ్ అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగునాట విజయ్ సేతుపతికి ఉన్న అభిమాన గణం ఎంతో బలంగా ఉంది. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఎంతో బలంగా ఉంటుంది. సినిమాలో ఎమోషన్స్, యాక్షన్ అన్ని రియాలిలికి దగ్గరగా ఉంటాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా ఉంటుంది అన్నారు. ఇటీవల పుష్ప సీక్వెల్‌గా వచ్చిన పుష్ప-2 ఎంతటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఆ కోవలోనే ఇదే నెలలో విడుదలవుతున్న విడుదల-2 కూడా అఖండ విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది' అన్నారు.
దర్శకుడుగా ఏడు సార్లు నేషనల్ అవార్డు పొందిన ఏకైక దర్శకుడు వెట్రీ మారన్, ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆర్ ఎస్ ఇన్ఫోటైన్మెంట్ అధినేత ఎల్రెడ్ కుమార్ తో కలిసి ఈ చిత్రాన్ని అత్య ద్భుతంగా తెరకెక్కించారు. మంచి కమర్షియల్ వాల్యూస్ ఉన్న ఈ చిత్రం తెలుగు హక్కులను మేము దక్కించుకున్నందుకు సంతోష పడుతున్నాం. డిసెంబర్ 20 న ఇండియన్ సెల్యూలాయిడ్ పై ప్రేక్షకులంతా చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం అని అన్నారు
విజయ్ సేతుపతి, మంజు వారియర్, సూరి, భవాని శ్రీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సూర్య సేతుపతి, అనురాగ్ కశ్యప్,రాజీవ్ మీనన్, ఇలవరసు , బాలాజీ శక్తివేల్