Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగనన్నకు జై... యాంకర్ శ్యామల, మరి షర్మిల పార్టీ సంగతేంటో?

Advertiesment
anchor syamala
, బుధవారం, 10 మార్చి 2021 (12:19 IST)
యాంకర్ శ్యామల. ప్రస్తుతం ఆమె పేరు షోలల కంటే రాజకీయాల్లో ఎక్కువగా వినబడుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఆమధ్య వైఎస్ షర్మిలను కలిసి ఆమె త్వరలో స్థాపించబోయే పార్టీకి మద్దతు పలికి వచ్చింది. దాంతో ఆమె వైసిపి కట్ చెప్పి షర్మిల పార్టీలో చేరుతారని ప్రచారం కూడా జరిగింది.
 
ఐతే అలాంటి వారందరకీ షాకిస్తూ శ్యామల ఓ ట్వీట్ చేసింది. అదేంటయా అంటే.. ముఖ్యమంత్రి జగన్ గారు విశాఖ ఉక్కు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారనీ, కార్మికులతో సమావేశంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వద్ద అఖిలపక్షాలను తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పింది.
 
ఈ చర్యల ద్వారా ఆంధ్ర ప్రజల ఆకాంక్షను కేంద్రానికి బలంగా తెలిపినట్లయింది. జగన్ గారి నాయకత్వంలో జరుగుతున్న ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని కోరుకుంటూ మీ వెనుక నడుస్తున్న లక్షల మందిలో నేను కూడా అంటూ శ్యామల ట్వీటింది. మరి ఈ ట్వీటుతో శ్యామల ఏ పార్టీవైపు వుంటారో తెలియక ఆమె అభిమానులు తికమకపడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేత్తడి హారికను తొలగించలేదట... ఉప్పల శ్రీనివాస్ గుప్తా