బల్గేరియాకు చెందిన బాబా వంగా గురించి తెలియనివారు వుండరు. బాబా వంగా నోటి నుంచి ఏదన్నా వస్తుందంటే, అది నిజమై తీరుతుందని విశ్వసించేవారు ఈ ప్రపంచంలో చాలామంది వున్నారు. బాబా వంగా మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఎందుకంటే... మరో వెయ్యి లేదా 2 వేల సంవత్సరాలకు చంద్రుడు లేకుండా పోతాడట. చందమామను పెద్ద గ్రహశకలం ఒకటి ఢీకొట్టి చంద్రుడు బూడిదలా మారిపోయి శూన్యంలో కలిసిపోతాడట. దీనితో భూమికి వున్నటువంటి ఒకే ఒక్క ఉపగ్రహం, వెన్నెల వెలుగులు పంచే చందమామ లేకుండా పోతాడట.
ఫలితంగా భూమిపైన పెనుమార్పులు ఏర్పాడతాయట. మానవ జాతితో పాటు జంతువులు, పక్షులు, జలచరాలు, వృక్షాలు... ఇలా అన్నింటిలోనూ వైవిధ్యం ఏర్పడి నశించడం మొదలుపెడుతుందట. వాతావరణంలో పెనుమార్పులు సంభవించి మానవ జాతి మనుగడ కష్టతరంగా మారుతుందట. 5079 నాటికి భూమి పైన మానవ జాతి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందట. అంతేకాదు... భూమి కూడా అంతర్థానం అయిపోయే అవకాశం కూడా వున్నదట. ఈ భయంకరమైన ఘటనలు జరుగుతాయని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ బాబా వంగా మాత్రం తన జ్యోతిషం ద్వారా ఇవన్నీ జరుగుతాయని చెబుతున్నారు.
ఇంతకుముందు బాబా వంగా చెప్పినవి జరిగినవి కూడా వున్నాయి. నవంబర్ నెలలో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ పైన దాడి, కోవిడ్ 19 విధ్వంసం, ప్రిన్సెస్ డయానా మరణం వంటివి బాబా వంగా చెప్పినవాటిలో వున్నాయి.