Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి బాలయ్య సెన్సేషనల్ కామెంట్స్..!

Advertiesment
Balakrishna
, మంగళవారం, 2 జూన్ 2020 (11:35 IST)
జూనీయర్ ఎన్టీఆర్... తెలుగుదేశం పార్టీ విజయం కోసం గతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం తెలసిందే. ఎన్నికల ప్రచారం చేస్తుండగానే.. యాక్సిడెంట్ కావడం ఆ తర్వాత రాజకీయాలను పట్టించుకోవడం మానేసి సినిమాలపైనే కాన్సన్‌ట్రేషన్ చేస్తున్నారు. అయితే... తెలుగు తమ్ముళ్లు మాత్రం జూనీయర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని... ఆయన వస్తేనే తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఎంతో ఆశతో ఉన్నారు.
 
తెలుగుదేశం నాయకుల్లోను, అభిమానుల్లోనే కాకుండా సామాన్యుల్లో సైతం ఇదే అభిప్రాయం ఉంది. అయితే... ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్యని తారక్ రాజకీయ ప్రవేశం గురించి అడిగితే... నాన్నగారు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే నేను కూడా సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో ఉన్నాను.
 
కాకపోతే తారక్‌కి సినిమా రంగంలో మంచి ఫ్యూచర్ ఉంది. అది వదులుకుని రాజకీయాల్లోకి రమ్మనడం అనేది కరెక్ట్ కాదు. అది అతని నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అన్నారు. బాలయ్య మాటలను బట్టి... తారక్ తెలుగుదేశం పార్టీ విజయం కోసం రాజకీయాల్లోకి వస్తానంటే తనకు అభ్యంతరం లేదు అనేది చెప్పకనే చెప్పారు.
 
 ఈవిధంగా బాలయ్య తారక్ పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడటం అటు సినిమా రంగంలోను ఇటు రాజకీయ రంగంలోను హాట్ టాపిక్ అయ్యింది. మరి.. బాబాయ్ బాలయ్య కామెంట్స్ పైన అబ్బాయ్ తారక్ స్పందిస్తారేమో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తాగొద్దురా మగడా.. అంటే భార్యను చంపేశాడు..