Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మమ్మీ.. డాడీ ఎక్కడికి వెళ్లారు.. ఎపుడొస్తారు... వెక్కివెక్కి ఏడుస్తున్న జోహ్రా

జమ్మూకాశ్మీర్‌లో 2017లో తీవ్రవాదుల ఏరివేత కోసం జరిపిన ఆపరేషన్‌లో ఏఎస్ఐగా పని చేసిన అబ్దుల్లా రషీద్ ప్రాణాలు కోల్పోయాడు. కానీ, ఈయన చిన్నకుమార్తె జోహ్రా మాత్రం ఇప్పటికీ వెక్కివెక్కి ఏడుస్తూనే ఉంది.

Advertiesment
jammu kashmir
, సోమవారం, 10 సెప్టెంబరు 2018 (11:00 IST)
జమ్మూకాశ్మీర్‌లో 2017లో తీవ్రవాదుల ఏరివేత కోసం జరిపిన ఆపరేషన్‌లో ఏఎస్ఐగా పని చేసిన అబ్దుల్లా రషీద్ ప్రాణాలు కోల్పోయాడు. కానీ, ఈయన చిన్నకుమార్తె జోహ్రా మాత్రం ఇప్పటికీ వెక్కివెక్కి ఏడుస్తూనే ఉంది. మమ్మీ.. డాడీ ఎపుడు వస్తాడు.. ఎక్కడికి వెళ్లాడు అంటూ కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తోంది. జోహ్రాకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక... పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి డాడీ వస్తాడమ్మా అంటూ సమాధానపరుస్తున్నారు.
 
2017, ఆగస్టు 28వ తేదీన జరిగిన ఆపరేషన్‌లో అబ్దుల్లా రషీద్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన అంత్యక్రియల సందర్భంగా కుమార్తె జోహ్రో కన్నీరుమున్నీరుగా విలపించింది. తండ్రి ఇక రాడన్న బాధతో రోదిస్తున్న జోహ్రా ఫొటోలు దేశమంతటిని కదిలించాయి. ఈ ఘటన అనంతరం మానసికంగా కుంగిపోయింది. ఆ చిన్నారిని కుటుంబ సభ్యులను తరచూ 'నాన్న ఎక్కడికి వెళ్లారు? ఎప్పుడు తిరిగివస్తారు?' అని అడుగుతోందని జోహ్రా సోదరి బిల్కిస్ తెలిపారు. 'ఈ సారి నాన్న ఇంటికి వస్తే ఆయన్ను అస్సలు వెనక్కి పోనివ్వను' అంటూ జోహ్రా చెబుతోందని కన్నీటి పర్యంతమయ్యారు. 
 
సాధారణంగా తండ్రులు కుమార్తెలపై ఎక్కువ ప్రేమ చూపిస్తే, తల్లులు మాత్రం కొడుకులపై ఎక్కువ ప్రేమ చూపిస్తుంటారు. ఆడ పిల్లలకైతే తండ్రితో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. తండ్రి సమయానికి ఇంటికి రాకపోయినా, అడిగిన డిమాండ్లు నెరవేర్చకపోయినా అలిగి కూర్చోవడం, తిరిగి బ్రతిమాలాక నాన్న మెడకు అల్లుకుపోవడం వీరికి మామూలే. కానీ ఆ తండ్రి ఇక ఎన్నటికీ తిరిగిరాడనీ తెలిస్తే? ఆ చిన్నారి మానసికంగా కుంగిపోదూ? మరి జోహ్రాను ఎలా ఓదార్చాలో తెలియక రషీద్ కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాహుల్ గాంధీ మాన‌స్ స‌రోవ‌ర్ యాత్ర - బీజేపికి కాంగ్రెస్ స‌వాల్..!